ఏదైనా విపత్తు  ఏర్పడినప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను  సమన్వయంతో చూస్తూ ముందుకు సాగాలి. కానీ ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా దేశానికి మొదటి నుంచి వత్తాసు పలుకుతూ వస్తుంది. మొదటి నుంచి అమెరికా చైనా పై చేస్తున్న విమర్శలను తప్పు పడుతూ వస్తున్నది  వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్... మొదట్లో అమెరికా ని సైతం తప్పుదోవ పట్టించింది అనే విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఓ వింత ప్రకటన చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అయితే అమెరికాకు చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు కరోనా  వైరస్ కు సంబంధించి కొన్ని పరిశోధనలు చేశారని... దీంట్లో ఎన్నో నమ్మలేని నిజాలు ఉన్నాయని... కరొన  వైరస్ చైనాలోని వైరాలజీ  ల్యాబ్ లో  సృష్టించబడింది అనే దానికి ఆధారాలు ఉన్నాయి అంటూ ఆరోపణలు చేసింది. 

 

 దీంతో వెంటనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ ఆరోపణలపై స్పందించింది. చైనా కరోనా వైరస్  సృష్టించింది అనడానికి అమెరికా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని..వుహాన్  నగరంలోని వైరాలజీ ల్యాబ్ లో  వైరస్ సృష్టించబడింది అనడం అవాస్తమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా ఇలాంటి ఆధారాలు  ఏవైనా ఉంటే తమ వద్దకు తీసుకు రావాలని తాము పరిశీలిస్తామని చెప్పారు. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటనపై ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 

 


 అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు చైనాలో పరిశోధనలు చేస్తామంటే అనుమతించలేదు... ఇక మొన్నటికి మొన్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు సంబంధించిన వారిని  కూడా అనుమతించలేదు. అయినప్పటికీ కూడా ఇంకా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైనా దేశాన్ని వెనకేసుకు వస్తూ వ్యాఖ్యలు చేస్తోందని మండిపడ్డారు విశ్లేషకులు. దేశంలోని అన్ని దేశాలను సమన్వయంగా చూడాల్సింది పోయి.. వ్యవస్థను భ్రష్టు పట్టించే విధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వ్యవహరించడం సరికాదు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: