ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమకున్న అధికారాన్ని లిమిట్స్ కు తగ్గట్టుగా చేసుకుంటూ పోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అయితే విద్యుత్ సంబంధించి గతంలో కూడా దీనికి సంబంధించిన చర్చ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలకు రెండు రూపాయల యాభై పైసలు కరెంటు వచ్చిన సందర్భంలో.. ఏడు రూపాయల యాభై  పైసల కు కరెంటు కొన్నటువంటి సందర్భం కూడా ఉంది. ఇక దీనికి కారణం ఏం చెప్తారు అంటే రెండున్నర రూపాయలకు వచ్చేటువంటి కరెంటు ఇచ్చేటువంటిది కేవలం ప్రభుత్వ సంస్థలు మాత్రమే ప్రైవేట్ సంస్థలకు ఎక్కువ ఖర్చులు ఎక్కువ పెట్టుబడులు ఉంటాయి కాబట్టి అంత తక్కువ కరెంట్  ఇవ్వడానికి ఒప్పుకోరు. 

 


 ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో చంద్రబాబు నాయుడు ప్రైవేట్ సంస్థలతో విద్యుత్ కొనేందుకు ఏడున్నర  రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక దీని తోసిపుచ్చుతూ జగన్ సర్కార్కు హైకోర్టులో పిటిషన్ వేయగా.. దీనిని హైకోర్టు అంగీకరించక ఒప్పందాలను ఆచరణలో పెట్టాలని జగన్ సర్కార్ కు షాక్ ఇవ్వడం జరిగిపోయాయి. ప్రస్తుతం ప్రైవేట్ స్వదేశీ సంస్థలు ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇక్కడ ఎక్కువ లాభాలు వస్తున్నాయని పెట్టుబడులు పెట్టాలి అంటూ చెబుతుండడంతో.. విదేశాల సంస్థలు కూడా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయి. 

 

 కానీ అది కాస్త ప్రస్తుతం జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత తేడా కొట్టేసింది. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ ప్రైవేటు సంస్థలతో ఒక యుద్ధమే చేస్తోంది. దీనివల్ల ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు రావడం ఆగిపోయింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ వ్యవస్థను తమ ఆధీనంలోకి  తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. అయితే అసలు జీవితంలో ఊహించనటువంటిది 24 గంటల కరెంటు అనేది ప్రస్తుతం సాధ్యమైంది. విద్యుత్ సంస్థలని ఒకే వేదిక పైకి తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ క్రింది వీడియోలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: