కరోనా  వైరస్ గురించి జగన్ మాట్లాడిన మాట వివాదంగా మారింది. ఆ తర్వాత కేసిఆర్ గాని కేజ్రీవాల్ కానీ అదే మాట మాట్లాడారు. అయితే మొట్టమొదట ఈ వైరస్ కేవలం ఒక చిన్న జ్వరం టాబ్లెట్ తో తగ్గిపోతుంది అని అనుకున్నప్పటికీ.. ఆ తర్వాత ఈ వైరస్ ఉదృతి  ఎలా ఉన్నదో  తత్వం అందరికీ బోధపడింది. దీంతో ఈ వైరస్ తో  కొన్నాళ్ల పాటు సహజీవనం చేయక తప్పదు అని  ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది. మహమ్మారి వైరస్ వదిలేది కాదు వెంటాడేది  అని  అందరికీ స్పష్టంగా జ్ఞానోదయం అయ్యింది. 

 


 కానీ  ముందు కేంద్రానికి గానీ రాష్ట్రాలకు ఇతర దేశాలకు గాని ఈ వైరస్ గురుంచి అవగాహనా  లేదు. క్రమక్రమంగా ఈ వైరస్ వ్యాప్తి జరుగుతున్న నేపథ్యంలో అందరికీ అవగాహన వచ్చేసింది. అయితే ఈ మహమ్మారి వైరస్ ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిపోయింది ఈ నేపథ్యంలో ఈ మహమ్మారి వైరస్ తో కలిసి బతక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ మహమ్మారి వైరస్ వ్యాప్తి కావడానికి జంతువులు మరేదో ఇతర కారణాలు మాత్రం లేవు.. కేవలం మనిషి నుంచి మనిషికి మాత్రమే ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. 

 


 అంటే ఈ మహమ్మారి వైరస్ వ్యాప్తికి మనిషి ఒక వాహకం గా మారిపోతున్నాడు. ఇక ఆ మనిషి ఏదో కావాలని చేస్తున్నది కాదు.. అతడి లో వైరస్ ఉంది అని అతనికి కూడా తెలియని పరిస్థితి అది తెలిసేసరికి ఇంకా ఎంతో మందికి అంటిస్తున్నాడు. దీంతో ప్రస్తుతం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలాంటి పరిస్థితిలు  వచ్చిన తట్టుకొని సిద్ధం కావాలని తమ తమ రాష్ట్ర పరిధిలోని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక నిదానంగా ఈ లాక్ డౌన్ పరిస్థితులకు అలవాటు చేసుకోవాలని తగిన జాగ్రత్తలు పాటిస్తూ వైరస్ తో సహజీవనం చేస్తూ నివారించాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: