ఆంధ్రాలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కనీసం 50 కి తగ్గకుండా రోజూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు ఏపీ చుట్టూ ఉన్న పొరుగు రాష్ట్రాల్లో తమిళనాడు మిగిలిన చోట్ల కరోనా విజృంభణ అంతగా లేదు. తెలంగాణలో రోజూ ఐదో పదో కొత్త కేసులు వస్తున్నాయి. మరీ ఏపీలా ఫుల్ జోష్ లేదు. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ వాసులు ఆందోళన చెందుతున్నారు.

 

 

ఈ కరోనా కేసులకు అంతం ఎప్పుడని ఆందోళన చెందుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ వాసులుకు కాస్త ఊరటనిచ్చే కొన్ని అంశాలూ ఉన్నాయి. అవేటంటే... కరోనా కేసుల విషయంలో డిశ్చార్జ్ విషయంలో ఏపీ ట్రాక్ రికార్డు బావుంది. కోవిడ్‌ కేసుల డిశ్చార్జిలో దేశ సగటు 28.63 శాతం అయితే రాష్ట్రంలో 41.02 శాతంగా ఉంది. అంతే కాదు కరోనా పరీక్షల్లో పాజిటివిటీ రేటు కూడా ఏపీ మెరుగ్గా ఉంది.

 

 

దేశంలో ఈ కరోనా పాజిటివిటీ కేసుల రేటు 3.87 శాతంగా ఉంది. అదే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 1.26 శాతంగా ఉంది. ఏపీలో డిశ్చార్జి కేసులకు సంబంధించి పటిష్టమైన ప్రోటోకాల్‌ పాటిస్తున్నారు. వరుసగా రెండు పరీక్షల్లో నెగెటివ్‌ వస్తేనే డిశ్చార్జి చేస్తున్నారు. అంతే కాద.. టెలిమెడిసిన్‌లో భాగంగా సబ్‌ సెంటర్లకు మందులు పంపించి డాక్టర్ల ఇచ్చిన ప్రిస్కిప్షన్‌ మేరకు వారికి పంపిణీ చేస్తున్నారు.

 

ప్రస్తుతమే కాదు.. త్వరలో విదేశాలు, సహా పలు రాష్ట్రాల నుంచి దాదాపు లక్షన్నర మంది వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి దానిపైనా ఏపీ అధికారులు దృష్టి సారించారు. విదేశాల నుంచి వచ్చేవారంతా విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలకు వస్తారు. వచ్చిన వారందరికీ అక్కడే మెడికల్‌ స్క్రీనింగ్‌ చేయిస్తారు. వారిని క్వారంటైన్‌ చేసి పర్యవేక్షణ చేస్తామని ఆతర్వాతే వారిని స్వస్థలాలకు పంపిస్తారు. విదేశాల నుంచి వచ్చే వారిని వారు వస్తోన్న దేశాల్లో కరోనా తీవ్రత బట్టి వర్గీకరిస్తున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: