కరోనా కట్టడి కోసం దేశ వ్యాప్త లాక్డౌన్  కొనసాగుతున్న నేపధ్యం లో రాష్ర్టాల ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోతున్నాయి . లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం తో , రాష్ర్టాలకు కాసింత వెసలుబాటు లభించినట్లయింది . ఆర్ధికంగా దివాళా తీస్తోన్న రాష్ర్టాలు, తమ  ఖజానాను భర్తీ చేసుకునేందుకు  సుదీర్ఘ విరామం తరువాత మద్యం దుకాణాలను  ప్రారంభించాలని నిర్ణయించాయి . లాక్ డౌన్ సమయంలో నష్టపోయిన ఆదాయాన్ని తిరిగిరాబట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి .

 

దానిలో భాగంగా రాష్ర్టాలు  మద్యం ధరలు పోటీపడి పెంచేందుకు ఆరాటపడ్డాయి  . అంధ్రప్రదేశ్  , ఢిల్లీ లు అత్యధికంగా 75 ..70  శాతం మద్యం ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి . అంధ్రప్రదేశ్ ప్రభుత్వం  తొలుత 25  శాతం మాత్రమే మద్యం ధరలను  పెంచుతున్నట్లు పేర్కొంది . అయితే  మరుసటి రోజే మద్యం ధరల పెంపును సవరిస్తూ , అదనంగా మరో  50 శాతం ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ  చేసింది . అంతకుమునుపే డిల్లీ ప్రభుత్వం 70 శాతం  మద్యం ధరలను  పెంచాలని  నిర్ణయించింది . ఇక  పశ్చిమ బెంగాల్ , కర్ణాటక రాష్ర్టాలు కూడా మద్యం ధరలను  పెంచుతూ  ఉత్తర్వులు జరి చేశాయి .

 

ఇక  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్యం ధరలను పెంచి , రాష్ట్ర ఖజానాకు నింపుకోవాలని నిర్ణయించింది . ఈ మేరకు సాధారణ మద్యం పై 11 శాతం , ఖరీదైన మద్యం పై 16 శాతం  ధరలు పెంచుతూ అమ్మకాలకు  అనుమతించింది . దీనితో పొరుగు రాష్ర్టాలతో పోలిస్తే , తెలంగాణతో మద్యం ధరలు తక్కువగానే పెంచడంతో మందుబాబులు బతుకు జీవుడా అనుకుంటున్నారు . మద్యం ధరలు ఎంతగా పెంచినా రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు  ప్రారంభించకముందే మద్యం ప్రియులు  బారులు తీరడం చూస్తుంటే , ధరల పెంపు నిర్ణయం తో నిమిత్తం లేకుండా   తాగేందుకు పోటీపడుతున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: