కరోనాతో లాక్ డౌన్ అమలు చేయడం వల్ల.. దేశవ్యాప్తంగా ఉన్న వలస కూలీలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ సొంత రాష్ట్రాలకు వెళ్లాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో వారు వందల కిలోమీటర్ల నడకకు సైతం సిద్దపడ్డ దృశ్యాలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. అయినా సరే కేంద్రం మనసు కరగలేదు. ఎట్టకేలకు లాక్ డౌన్ నిబంధనల సరళీకరించిన సమయంలో వలస కూలీలో కోసం ప్రత్యేకంగా రైళ్లు వేస్తామని చెప్పడం ఆ కూలీలకు కాస్త ఊరటనిచ్చింది.

 

 

అయితే కేంద్రం ఇక్కడో మెలిక పెట్టింది. వలస కూలీలను వారి సొంత రాష్ట్రాలకు పంపే ఖర్చులో 85 శాతం కేంద్రం భరిస్తుందని.. మిగతా 15 శాతం ఆయా రాష్ట్రాలే భరించాలని కేంద్రం చెబుతోంది. దీని ప్రకారం.. వలస కూలీల ప్రయాణానికయ్యే రైలు ఛార్జీల ఖర్చును ఆ రైలు బయలు దేరే రాష్ట్రం పెట్టుకోవాలి. కాలంటే.. ఆ రైలు వెళ్లే రాష్ట్రం వద్ద ఈ చార్జీని వసూలు చేసుకోవచ్చని తెలిపింది.

 

 

ఈ నిబంధనలకు ఇష్టం ఉన్నా లేకపోయినా చాలా రాష్ట్రాలు అంగీకరించాయి. తమ రాష్ట్ర వాసులను తమ రాష్ట్రానికి రప్పించుకుంటున్నాయి. అయితే ప్రధానంగా మూడు రాష్ట్రాలు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అవేమిటంటే.. రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్ర. మరి వీరి వాదన ఏంటి.. వలస కూలీలను కేంద్రం తన సొంత ఖర్చులతో రాష్ట్రాలకు పంపించాలన్నది ఈ రాష్ట్రాల వాదన. కానీ ఇది కుదరదని కేంద్రం చెబుతోంది.

 

 

మరి ఎందుకు ఈ మూడు రాష్ట్రలే ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అంటే.. ఈ మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ అధికారంలో ఉన్న విషయాన్ని గమనించాలి. అంటే రాజకీయం కోసం ఏకంగా లక్షల మంది వలస కార్మికుల భవిష్యత్తుతో సోనియా గాంధీ ఆటలాడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మూడు రాష్ట్రాలు కూడా తమ వలస కార్మికులను రాష్ట్రానికి రప్పించుకోవాల్సిన అవసరం ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: