ఇండియాలో కరోనా తీవ్ర రూపం దాల్చింది  ప్రస్తుతం మూడో దశ లాక్ డౌన్ కొనసాగుతున్న కూడా పరిస్థితి ఏ మాత్రం  అదుపులోకి రావడం లేదు. నిన్న ఒక్క రోజే  దేశ వ్యాప్తంగా  3000కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో మహారాష్ట్ర లో 1233 , తమిళనాడు లో 771, ఢిల్లీ 428, గుజరాత్ 380, పశ్చిమ బెంగాల్ 112 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 52000 కు చేరగా 1400 కు పైగా మరణాలు సంభవించాయి. 15000మంది బాధితులు  కోలుకున్నారు.
 
మరో వైపు ఈనెల 17న మూడో దశ లాక్ డౌన్ ముగియనుంది మరి అప్పటి వరకు  కరోనా కంట్రోల్ అవుతుందా అంటే కష్టమే అనిపిస్తుంది. రోజు రోజు కు కరోనా ప్రభావం ఎక్కువతుందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. ఇక 17వ వరకు  కరోనా ప్రభావం తగ్గకుంటే మరోసారి లాక్ డౌన్ పొడిగించడం తప్పదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ  వెల్లడించింది. దాంతో  ఈనెల  మొత్తం లాక్ డౌన్  కొనసాగడం ఖాయమయ్యెట్లే వుంది. అయితే తొందరగానే మేల్కొని  లాక్ డౌన్ విధించారు  కాబట్టి సరిపోయింది లేకపోతే  కరోనా కేసుల్లో భారత్ ఈపాటికే అమెరికా ను దాటేసేది. 
 
ఇక మిగితా దేశాల విషయానికి వస్తే సౌత్ కొరియా లో గత మూడు రోజుల నుండి  జీరో కేసులు నమోదయ్యాయి.  కరోనా ఎంత ప్రమాదకరమో ముందే గమనించి సౌత్ కొరియా పకడ్బందీ వ్యూహం తో కరోనా ను జయించింది.  ఆదేశంలో ఇటీవలే లాక్ డౌన్ ను ఎత్తివేయగా మాస్క్ ల వాడకాన్ని అలాగే  భౌతిక దూరం ను పాటించడం వంటి  వాటిని తప్పనిసరి చేసింది. న్యూజిలాండ్ లో కూడా గత రెండు రోజుల నుండి జీరో కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 3600000  కుపైగా మంది కరోనా బారిన పడగా అందులో 258000 మరణాలు సంభవించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: