ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రో7నా వైర‌స్ మ‌హ‌మ్మారి ఎలా విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మ‌న‌దేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు ఇప్ప‌టికే 50 వేల‌కు చేరువ అవుతున్నాయి. ఇక మ‌న దేశంలో క‌రోనా కేసుల‌ను క‌ట్ట‌డి చేసేందుకు ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా క‌రోనా మాత్రం చాప‌కింద నీరులా వ్యాప్తి చెందుతూనే  ఉంది. ఇప్ప‌టికే లాక్‌డౌన్ మూడు సార్లు పొడిగించు కుంటూ వ‌చ్చారు. ఇక రెడ్ జోన్ల‌లో మ‌రింత క‌ఠిన‌మైన నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్నారు. ఇక తెలంగాణ‌లో అయినా లాక్‌డౌన్ ఈ నెల చివ‌రి వ‌ర‌కు కూడా పొడిగించారు.

 

ఇక క‌రోనా క‌ట్ట‌డి కోసం దేశ‌వ్యాప్తంగా తీసుకుంటున్న చ‌ర్య‌ల్లో కీల‌కంగా ఉంటోన్న‌ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కరోనా వ్యాప్తిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మ‌న‌దేశంలో క‌రోనా క‌ట్ట‌డి విష‌యంలో తీసుకుంటోన్న చ‌ర్య‌ల‌కు సంబంధించి ఈయ‌నే కీల‌క భూమిక పోషించారు. ఇక ఈ క‌రోనా ఇప్ప‌ట్లో మ‌న దేశాన్ని వ‌దిలి పెట్టే ప్ర‌శ‌క్తే ఉండ‌ద‌ని కూడా ఆయ‌న చెప్ప‌డం సంచ‌ల‌నంగా మారింది. ప్ర‌స్తుతం వేస‌వి నేప‌థ్యంలో క‌రోనా క‌ట్ట‌డి ఓ విధంగా త‌క్కువుగా ఉన్న‌ట్టే క‌న‌పడుతోందని... వ‌చ్చే శీతాకాలంలో రెండోసారి ఈ వైర‌స్ తీవ్రంగా విజృంభిస్తుంద‌ని కూడా ఆయ‌న చెప్పారు.

 

మొత్తంగా చూస్తే ఓ యేడాది పాటు కరోనా మహమ్మారితో మనం పోరాటం చేయాల్సి ఉందని చెప్పారు. ఇక రెడ్ జోన్ల‌తో పాటు హాట్ స్పాట్ల‌ను ద‌గ్గ‌రుంచి ప‌ర్య‌వేక్షించాల్సిన అవ‌స‌రం కూడా ఉంద‌ని ఆయ‌న చెప్పారు. ఇక శీతాకాలంలో ఈ వైర‌స్ మ‌రింత పుంజుకుని విజృంభించే అవ‌కాశం ఉంద‌ని కూడా ప‌లువురు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. శీతాకాలంలో క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ఇప్ప‌టి నుంచి ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోక‌పోతే భారీ న‌ష్టం త‌ప్పేలా లేదు.

 

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న లెక్క‌ల‌ను బ‌ట్టి చ‌స్తే భారతదేశంలో ఇప్పటికే కేసులు 50 వేల‌కు చేరువ‌లో ఉండ‌గా...  12948 మంది కోలుకున్నారు. 1573 మంది మరణించారు. 32080 మంది ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: