ప్రస్తుతం విశాఖ నగరంలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం గా మారిన విషయం తెలిసిందే. ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఈ ఘటనపై స్పందించి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయింది అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే  కరోనా  వైరస్తో కొట్టుమిట్టాడుతున్న జనానికి మృత్యువు మరో రూపంలో కబళించింది. తెల్లవారుజామున ప్రజలందరూ నిద్రపోతున్న వేళ విషవాయువు రూపంలో మృత్యువు కబళించేందుకు  వచ్చింది. విశాఖ నగరం ఆర్ ఆర్ వెంకటాపురం లోని ఎల్జీ పాలిమర్స్ అనే ప్లాస్టిక్ తయారీ కంపెనీ లో నుంచి భారీ మొత్తంలో విషవాయువు లీక్ అయి మూడు కిలోమీటర్ల మేర వ్యాప్తి చెందడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ అస్వస్థతకు గురై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

 

 

 ఈ విష వాయువులను పీల్చడం ద్వారా నురగలు కక్కుతూ అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు  ప్రజలు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన అధికారులు వారందరినీ ఆసుపత్రికి తరలించారు. దీంతో విశాఖ లో ప్రస్తుతం క్రమక్రమంగా విషాదఛాయలు అలుముకున్నాయి. విశాఖపట్నం కాస్త విషాదపట్నం గా మారిపోతుంది. పరిస్థితి అంతకంతకు క్షీణిస్తూ వస్తోంది. విషవాయువు బారినపడి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ప్రజల పరిస్థితి విషమంగా  మారుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ విష వాయువు బారినపడి చాలామంది నిద్రలోనే చనిపోయినట్లు అనధికారికంగా అందిన సమాచారం. కొంతమంది ఆసుపత్రిలో కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. 

 

 

 అయితే విషవాయువు ఒక్కసారిగా భారీ మొత్తంలో వెలువడి గాలిలో కలిసి పోవడం కారణంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ ఈ విష వాయువుని  పీల్చుకున్నారు... దీంతో ఈ విష వాయువు కాస్త అందరి ప్రజల ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయింది. అయితే ప్రస్తుతం ఈ విష వాయువు నుంచి చికిత్స తీసుకుని ప్రాణాలతో బయటపడిన ఈ విష వాయువు ఊపిరితిత్తులలోకి వెళ్లడం కారణంగా భవిష్యత్తులో కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ విష వాయువు ప్రాణాంతకమైనది. ఇప్పటికే చుట్టుపక్కల గ్రామాల్లో కొంత మంది ప్రాణాలను కూడా బలితీసుకుంది. దీంతో ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి బయటపడినప్పటికీ రానున్న రోజుల్లో ఊపిరితిత్తుల సమస్యలు వచ్చి  ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం లేకపోలేదని వైద్యనిపుణులు  చెబుతున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: