విశాఖపట్నం గోపాలపట్నం పరిధి ఆర్‌.ఆర్‌.వెంకటాపురం ఈ తెల్ల వారు జామున ఉపిరాడక ఉక్కిరిబిక్కిరయింది. కొంతమంది ప్రజలు సృహ కోల్పోయారు. కొందరికి చర్మం మీద దద్దులు వచ్చారు. నిద్రమత్తు విదిలించుకుని చాలా మంది ప్రాణభయంతో పరిగెత్తారు. అంబులెన్సలొచ్చి చాలా మంది ఆసుప్రతులకు తరలించాయి.  ఈ ఘటన గురువారం తెల్లవారుజామున 3 గంటలకు సంభవించినట్లు అధికారులు గుర్తించారు. రసాయన వాయువు లీకేజీని అరికట్టేందుకు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ రసాయన వాయువు లీక్‌ కావడంతో విశాఖ పట్టణం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. రసాయన వాయువు లీక్‌ అయిందన్న విషయం తెలుసుకున్న ఆర్‌.ఆర్‌. వెంకటాపురం గ్రామస్తులు ఇండ్లలోనే ఉండిపోయారు. అక్కడ ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

 

సాయంత్రానికి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వాయువు ప్రభావంతో మనషులే కాదు.. మూగ జీవాలు కూడా బలవుతున్నాయి. పరిశ్రమ పరిసర ప్రాంతాల్లోని ఆవులు, దూడలు విగతజీవులుగా పడిపోయాయి. అక్కడున్న చెట్లు మాడిపోయాయి. ఈ భయంకరమైన గ్యాస్ లీక్ వల్ల భవిష్యత్ లోమరిన్ని ప్రమాదాలు ఉన్నాయని..  విశాఖలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకేజీతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, వందల మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిశ్రమ నుంచి స్టెరీన్ అనే గ్యాస్ లీక్ అయినట్లు తెలుస్తోంది.

 

ఈ గ్యాస్ వల్ల తొలుతగా తలనొప్పి, వినికిడి సమస్య, నీరసం, కళ్ళు మంటలు వస్తాయి. ఇదే గ్యాస్‌ను ఎక్కువగా పీలిస్తే క్యాన్సర్, కిడ్నీ వంటి వ్యాధులతో బాధపడే అవకాశం ఉందని అంటున్నారు.    ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ 1997లో ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలో నెలకొల్పబడింది. 213 ఎకరాల విస్తీర్ణంలో 168 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంతో ఈ సంస్థ ప్రారంభమైంది. ఈ కంపెనీ ప్రతిరోజు 417 టన్నుల పాలిస్టెరీన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని స్టెరీన్ అనే ముడిసరుకు ద్వారా ఉత్పత్తి చేస్తారు. ప్రస్తుతం ఆ పరిశ్రమ నుంచి స్టెరీన్ గ్యాస్ లీక్ అయినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: