దేశంలో ఫిబ్రవరి మాసం నుంచి కరోనా కేసులు మొదలయ్యాయి. మొదట ఈ కరోనా ప్రభావం కేరళాలలో మొదలైనప్పటికీ ఇప్పుడు మాత్రం దీని ధాటికి మహరాష్ట్ర అతలాకుతలం అవుతుంది. నిన్న ఒక్క రోజే అక్కడ అత్యధికంగా 1, 233 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 16,758కి పెరిగింది.  గత కొన్నిరోజుల నుంచి  మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం దాల్చింది.  అన్నింటికి మించి కొన్ని రోజుల నుంచి ముంబైలో పరిస్థితి భయానకంగా ఉంది. అప్పుడే పుట్టిన చిన్నారికి కరోనా  సోకింది.

 

ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క రోజులో నమోదైన అత్యధికం కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి.  గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో కరోనాతో 34 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 651కు చేరుకుంది. ఇక్కడ ఒక్క రోజే  769 కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఫలితంగా ఒక్క ముంబైలోనే కరోనా బాధితుల సంఖ్య 10,527కి చేరింది. అలాగే, నగరంలో నిన్న 25 మంది కరోనా కాటుకు ప్రాణాలొదిలారు. దీంతో ఇక్కడ మృతుల సంఖ్య  412కి చేరింది. రాష్ట్రంలోని మొత్తం మరణాల్లో దాదాపు 65 శాతం ఇక్కడే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

 

ఇదిలా ఉంటే  ఆసియాలోనే అతిపెద్ద మురికవాడ ధారవిలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. అక్కడ కొత్తగా 68 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ధారవిలో మొత్తం కేసుల సంఖ్య 733కి చేరింది. బుధవారం కరోనాతో మరో వ్యక్తి మరణించడంతో అక్కడ మృతుల సంఖ్య 21కి పెరిగింది. దేశంలో ఎంతో గొప్ప వాణిజ్య ప్రదేశం అయిన ముంబాయి ఇప్పుడు కరోనా కోరల్లో చిక్కుకొని విల విలలాడుతుంది.. రికవరీ కాలాంటే చాలా సమయం పట్టేట్టుందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: