ఈ రోజు తెల్లవారు జామున జరిగిన వైజాగ్ గ్యాస్ లీక్ ఘటన హృదయాలను కలిచివేసింది. ఎల్ జి పాలిమర్స్ అనే కంపెనీ నుండి స్టెరిన్  గ్యాస్ లీక్ అయ్యి క్షణాల్లో గాలిలో కలిసిపోవడంతో చుట్టు పక్కల వున్న గ్రామాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఈ గ్యాస్ ను పీల్చుకొని కొంత మంది సృహ తప్పి పడిపోగా మరి  కొంత మంది బయంతో పరుగులుతీశారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేప్పట్టాయి. ఇప్పటివరకు ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా 800 మంది బాధితులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. ఈ విషవాయువు దాటికి చుట్టు పక్కల వున్న చెట్లు వాడిపోగా వందల సంఖ్యలో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి.
 
ఇక గ్యాస్ లీకేజీ ఘటన పై తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. దీనిని దురదృష్టకర సంఘటనగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నాను. అస్వస్థతకు గురైన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్దించారని  ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఇక గ్యాస్ లీక్ ఉదంతాన్ని కేంద్రం కూడా సీరియస్ గా తీసుకుంది. ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్ తో ఫోన్ లో మాట్లాడారు  అన్ని విధాల కేంద్రం అండగా ఉంటుందని మోదీ చెప్పినట్లు సమాచారం. అలాగే  కేంద్ర హోమ్ సహాయక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
 
మరి కాసేపట్లో వైజాగ్ లోని కింగ్ జార్జ్ హాస్పటల్ లో చిక్సిత పొందుతున్న బాధితులను సీఎం జగన్ పరామర్శించనున్నారు. మరోవైపు ఏపీ ప్రతిపక్ష నేత చంద్ర బాబు కూడా బాధితులను పరామర్శించడానికి  సిద్ధమయ్యారు. అందుకోసం వైజాగ్ వెళ్ళడానికి కేంద్ర అనుమతి కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: