కరోనా వైరస్ నేపథ్యంలో భారతదేశంలో దాదాపు 40 రోజుల పాటు కొనసాగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే లాగ్ డౌన్  సడలింపులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మందుబాబుల నిరీక్షణకు తీరింది   మద్యం షాపులు ఇప్పటికే పలు రాష్ట్రాలలో ఓపెన్ అయ్యాయి . రోజు చుక్క పడితే కానీ మైండ్ పని చేయని మందుబాబులు  దాదాపు నెల రోజులకు పైగా మద్యం షాపులు తెరుచుకోకపోవడంతో అయోమయంలో పడిపోయారు. ఇక ఇప్పుడు మద్యం షాపులు తెరుచుకోవడం తో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో భారీ సంఖ్యలో మందుబాబులు  మద్యం షాపుల వద్దకు వెళ్లి మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. 

 

 

 అయితే మద్యం షాపులు తెరుచుకున్నాయి అని మందుబాబులు ఆనందపడేలోపే  వారికి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి . ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా అన్ని రాష్ట్రాలలో మద్యం  పెరగగా... తాజాగా లాక్ డౌన్ తర్వాత మళ్లీ మద్యం షాపులు తెరుచుకోవడంతో భారీ మొత్తంలో మద్యం ధరలు పెంచుతున్నాయి. దీంతో మందుబాబులు జోబులకు చిల్లు పడుతుంది. మద్యం తాగకుండా ఉండలేరు మరోవైపు ఇంత భారీ మొత్తంలో చెల్లించాలి అంటే ఇబ్బంది పడక తప్పదు... దీంతో మరోసారి మందుబాబులు  అయోమయంలో పడిపోతున్నారు. ఇక మద్యం ధరలను  భారీగా పెంచిన రాష్ట్రాల జాబితాలో తమిళనాడు ఉత్తరప్రదేశ్, చండీగఢ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. అటు  కర్ణాటక ప్రభుత్వం కూడా మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ సుంకాన్ని 11 శాతం పెంచి ఆదాయాన్ని మరింత గడించడానికి సిద్ధమయింది. 

 

 

 దీంతో ఇన్ని రోజుల వరకు ఏర్పడిన నష్టాన్ని భర్తీ చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. మరోవైపు మద్యం దుకాణాలు తెరిచి ఉంచడం ద్వారా ప్రజలు భారీ మొత్తంలో మద్యం దుకాణాలు వద్దకు చేరుకొని మద్యం కొనుగోలు చేయడం ద్వారా వైరస్ వ్యాప్తి జరిగే అవకాశముందని భావించిన పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం మద్యం హోమ్ డెలివరీ సేవలకు అనుమతులు ఇచ్చింది.  హోమ్ డెలివరీని  గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. అటు  కేవలం మద్యం ధరలు పెరగడమే కాదు పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరగడంతో సామాన్య ప్రజలకు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారిపోయింది పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: