ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. ఇప్పుడు ఈ పేర్ మాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. దాదాపు ఇర‌వై రోజులుగా కిమ్ జోంగ్ ఉన్ కనిపించకుండా పోవ‌డంతో.. ఆయ‌న చనిపోయాడంటూ అంతర్జాతీయ మీడియాలో వార్తలు జ‌ట్ స్పీడ్‌లో చక్కర్లు కొట్టాయి. అదే స‌మ‌యంలో కిమ్ జోంగ్  బతికే ఉన్నాడని, బతికి ఉన్నా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇటీవల కోలుకున్నారని కూడా చెబుతోంది. ఇలాంటి స‌మ‌యంలో గ‌త కొన్ని రోజులుగా క‌నిపించ‌కుండా పోయిన్ కిమ్‌.. గత వారం చివరిలో ఎరువుల కంపెనీ ఓపెనింగ్ కి వచ్చిన వార్త ఆ దేశ అధికారిక మీడియా సంస్థ వెల్ల‌డించింది.

 

ఇందుకు సంబంధించిన‌ వీడియోలో కిమ్ రాక చూసి ప్రజలంతా ఆశ్చర్య పోతున్నారు. తమ దేశ అధ్యక్షున్ని చూసి ఆ దేశ ప్రజలు ఆనందం వ్య‌క్తం చేశారు. దీంతో కిమ్ బతికే ఉన్నాడన్న కన్ఫర్మేషన్‌ వచ్చింది. అయితే ఆ కార్యక్రమానికి వచ్చింది అసలు కిమ్ కాదని, ఆయన డూప్ అని కొందరు సరికొత్త వాదనను తెరపైకి తీసుకువ‌చ్చారు. కిమ్‌కు సంబంధించి అంతకుముందు, ఇప్పుడు ఫొటోలను చూపిస్తోన్న చాలా మంది.. తేడాలను చెప్తున్నారు. కిమ్ కళ్లు, పళ్లు, దవడలను చూపిస్తూ.. వచ్చింది కిమ్ కాదని, అతడి డూప్‌ అని ఆధారాలు చూపిస్తున్నారు.

 

అంతేకాకుండా,  బ్రిటన్ మాజీ ఎంపీ లూయిస్ మెన్స్, గతంలోని కిమ్ చిత్రాన్ని, మొన్నటి చిత్రాన్ని పోస్ట్ చేస్తూ, పాత కిమ్ పళ్ల వరుసకు, కొత్త కిమ్ పళ్ల వరుసకూ తేడా కనిపిస్తోందని చెప్పడంతో, ఈ విషయం వైరల్ అయింది. ఆయన హెయిర్ స్టయిల్ కూడా మారిందని తెలిపారు.  ఇక ప్రముఖ డెయిలీ మెయిల్‌ వెబ్‌సైట్ కూడా ఓ కథనాన్ని ప్రచురించింది. కిమ్‌ జాంగ్‌ ఉన్‌ తన బాడీని డబుల్‌గా వినియోగించాడని అందులో ప్రచురించింది. దీంతో కిమ్‌పై అందరిలో మళ్లీ అనుమానాలు స్టాట్ అయ్యాయి. కిమ్ కూడా సెక్యూరిటీ రీజన్స్ తో తనలా పోలి ఉండే ఐదు మందిని వినియోగిస్తారని ప్రచారం ఉంది. ఈ క్ర‌మంలోనే అనుమానాలు మ‌రింత బ‌ల‌ప‌డ్డాయి. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది కాల‌మే చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: