విశాఖలో జరిగిన గ్యాస్ లీక్ ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తున్న  విషయం తెలిసిందే. ఒక కంపెనీ నిర్లక్ష్యం ఎన్నో జీవితాలను కకలవికలం చేసింది. ఆ విష వాయువు  కారణంగా కొన్ని గ్రామాల ప్రజలు ప్రాణాపాయ స్థితికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. తెల్లవారుజామున ప్రమాదవశాత్తు ప్లాస్టిక్  తయారీ కంపెనీ అయినా ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి వెలువడిన విషవాయువు పీల్చుకోవడం ద్వారా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ ఎక్కడికక్కడ కుప్పకూలిపోయి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటనలో దాదాపు వందల్లో  బాధితులు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విష వాయువు కారణంగా ఎన్నో హృదయ విదారక ఘటన లు  విశాఖలో చోటు చేసుకుంటున్నాయి. 

 

 

 రోడ్లపై ఇళ్లల్లో  ఇలా ఎక్కడపడితే అక్కడ మనుషులు పిట్టల్లా రాలి పోతున్నట్టుగా పడిపోయి ఉన్నారు. వేలల్లో పశువులు విషవాయువు కారణంగా మృత్యువాత పడ్డాయి. అయితే ఈ విషవాయువు ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతున్న విషయం తెలిసిందే. తాజాగా వైద్య వృత్తిని ఎంచుకుని ఎంతోమంది ప్రాణాలను కాపాడాలని అనుకున్న విద్యార్థి జీవితాన్ని చిదిమేసి కాటికి  పంపించింది విషవాయువు. ఆ విద్యార్థి కుటుంబంలో తీరని శోకాన్ని కన్నీళ్లను మిగిల్చింది . 

 

 

 వైద్య వృత్తి  ఇష్టమైన చంద్రమౌళి ఎంబిబిఎస్ ఎంచుకుని మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆంధ్ర మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న చంద్రమౌళి గత సంవత్సరం మెడికల్ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా మెరిట్ సాధించి సీట్  సంపాదించుకున్న ఒక టాలెంటెడ్ విద్యార్థి. ఎంబీబీఎస్ పూర్తి చేసి ఎంతో మందికి వైద్య సేవలు అందించాలని ఎన్నో కలలు కన్నాడు. భవిష్యత్తులో ఎంతోమంది ప్రాణాలను కాపాడాలని అనుకున్నారు. కానీ ఇంతలో విషవాయువు రూపంలో ఆ విద్యార్థిని మృత్యువు కబళించింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు కళ్లెదుటే చనిపోవడంతో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: