ఒకప్పుడు దొంగలు రాత్రి పూట తిరుగుతూ కనిపించిన ఇళ్లకు కర్ణాలు వేస్తూ వచ్చేవారు.. ఇప్పుడు టెక్నాలజీ మారడంతో దొంగలు కూడా స్టయిల్ మార్చారు.. అధునాతన పద్ధతులు ద్వారా దొంగ తనాలు చేసుకుంటూ వస్తున్నారు.  పెద్ద పెద్ద దుకాణాలలో లేదా బ్యాంకులలో, ఏటీఎం సెంటర్లో ఈ దొంగతనాలు ఎక్కువగా జరుగుతూ పోలీసులకు పని పెడుతూ వచ్చారు.. కానీ ఇప్పుడు ఏకంగా జంతువులు కూడా దొంగతనాలు చేస్తున్నాయట ఎక్కడో చూడండి..



 

 

దేరాజధాని ఢిల్లీలోని ఓ ఏటీఎం సెంటర్‌లో ఓ కోతి హంగామా చేసింది. లాక్‌డౌన్ వేళ నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఏటీఎంలోకి ప్రవేశించిన వానరం క్యాష్ డిస్పెన్సింగ్ మెషీన్‌ను పగులగొట్టింది. మెషీన్‌లో క్యాష్ ఉందా, లేదా అన్నట్లు పరిశీలించింది. ఏటీఎం గోడలకు ఉన్న పోస్టర్లను చించేసింది. నానా బీభత్సం చేసి అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆ ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి వచ్చిన కొంత మంది స్థానికులు ఏటీఎం మెషీన్ పగులగొట్టి ఉండటం చూసి షాక్‌కు గురయ్యారు. దొంగతనం జరిగి ఉంటుదనే అనుమానంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.




 

అందిన సమాచారం ప్రకారం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ పడిఉన్న వస్తువులను చూసి దొంగతనం జరిగి ఉంటుందని అంచనా వేశారు..ఏటీఏం కేంద్రంలోని సీసీటీవీ ఫుటీజీలు పరిశీలించగా.. ఓ కోతి వచ్చి ఈ రచ్చ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో చూసి పోలీసులు నవ్వుకున్నారు. లాక్‌డౌన్‌లో ఏటీఎం ఎవరు పగులగొట్టారా అని ఆరా తీస్తున్న పోలీసులు.. వీడియోలో కోతి ఉండటాన్ని చూసి విస్తుపోయారు. ఢిల్లీలోని సౌత్ ఎవెన్యూ ప్రాంతంలోని ఎస్‌బీఐ ఏటీఎంలో బుధవారం నిన్న మధ్యాహ్నం 3.10 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తినడానికి ఏమైనా దొరుకుతాయోమోనని ఆశగా చూసి ఆ వానరం ఇలా చేయొచ్చని అనుమానిస్తున్నారు. మొత్తానికి దొంగతనం జరగలేదని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: