ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 50000 దాటి రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో 15 వేలకు పైగా కరోనా బాధితులను ఆ వైరస్ నుంచి విముక్తి కలిగించారు డాక్టర్లు. ప్రస్తుతం ఈ రోజు వరకు దేశంలో 1700 మంది పైగా ఈ వ్యాధి బారినపడి మరణించారు. అయితే కొన్ని రోజుల క్రితం గ్రేటర్ నోయిడాలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితురాలిపై ఇద్దరు సిబ్బంది వేధించిన సంఘటన అందరికీ తెలిసిన విషయమే.

IHG

అయితే సదరు మహిళ, వారిపై హాస్పిటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో ఆస్పత్రి యాజమాన్యం వారు వారిపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేయించారు. ఆ నిందితుల వివరాలు కొస్తే ఆస్పత్రిలో పనిచేసే శానిటేషన్ వర్కర్ ప్రవీణ్, స్టోర్ వర్కర్ లవ్ కుష్ పై IPC సెక్షన్ 354 ప్రకారం కేసు నమోదు చేశామని పోలీసులు పూర్తి వివరాలను తెలిపారు.

IHG


అయితే సదరు శారద ఆసుపత్రి యాజమాన్యం మాట్లాడుతూ.... ఇటీవల ఒక బిడ్డకు జన్మనిచ్చిన మహిళ కరోనా టెస్ట్ చేయించుకోవడానికి వచ్చిన నేపథ్యంలో ఆమె ఆస్పత్రిలో చేరింది. అయితే ఆమెపై ఇద్దరు సిబ్బంది లైంగికంగా వేధించినట్లు తెలిసిందని అది మా దృష్టికి వచ్చిందని వారు తెలిపారు. ఇక పూర్తి వివరాలను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వారిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని వారు తెలియజేశారు. అంతేగాక వారిద్దరిని ఉద్యోగాల నుంచి తొలిగించామని అని కూడా వారు తెలిపారు. అంతే కాకుండా ఆ ఉద్యోగులను నియమించిన ఏజెన్సీకి కూడా సమాచారం తెలిపామని హాస్పిటల్ సిబ్బంది తెలిపారు. సదరు మహిళకు ఆసుపత్రి తరఫున మేనేజ్మెంట్ క్షమాపణ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: