ఆగస్టు 11, 1973 న కూల్ హెర్క్ అనే ఒక డీజే బూగీ డౌన్ బ్రాంక్స్ లో బ్యాక్ టూ స్కూల్ అనే ఒక పార్టీని బ్యాక్ టూ స్కూల్ అనే పార్టీ ఇవ్వగా... ఆ పార్టీలో సంగీతంలో కొత్త ఒరవడి తెరమీదకి వచ్చింది. అదేంటంటే రెండు టర్న్ టేబుల్స్ లను ఉపయోగించిన డీజే... సంగీత పరికరం యొక్క బ్రేకులు పొడగించి... పాట పూర్తి అవకుండా డిస్కులను వెనక్కి ముందుకి తిప్పారు. దీని ఫలితంగా పాట ఎక్కువసేపు ప్లే అవ్వడం తో పార్టీకి హాజరైన వారు ఎక్కువ సమయం పాటు డాన్స్ చేయగలిగారు. ఈ పద్ధతే బ్రేక్ డాన్స్ అనే పేరుతో అశేషమైన జనాదరణ పొందింది. బ్రేక్ డాన్స్ శైలికి ఇంకాస్త మెరుగులు దిద్దుతూ బీట్ కు తగిన పాటలను చేర్చి పార్టీ రాను మరింత ఉత్సాహంగా చేశాడు ఎంసి. తదనంతరం హిప్ హోప్ సంస్కృతి సంగీతం ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన శైలి అయ్యింది. హిప్ హోప్ సంస్కృతి పాటలలో, ఫ్యాషన్ వస్త్రాలలో, ఆర్ట్ లలో, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలో స్థానాన్ని ఏర్పరచుకుంది.


అయితే ఈ విషయాలన్నీ గూగుల్ సంస్థ యో! ఎమ్టీవీ రాప్స్ మాజీ వ్యాఖ్యాత ఫ్యాబ్ 5 ఫ్రెడ్డీ తో యానిమేషన్ రూపంలో గూగుల్ డూడుల్ (google doodle) లో తెలియపరిచింది. ఆ తర్వాత రెండు టర్న్ టేబుల్స్ లను ఉపయోగిస్తూ హిప్ హోప్ బ్రేక్ మ్యూజిక్ ఎలా క్రియేట్ చేయాలో ఒక వీడియో రూపంలో తెలిపింది. ఒకసారి మీరు ట్యుటోరియల్ తెలుసుకున్న తర్వాత... సొంతంగా మీరే టర్న్ టేబుల్స్ ముందుకూ వెనక్కూ కదుపుతూ హిప్ హోప్ బ్రేక్ మ్యూజిక్ క్రియేట్ చేయవచ్చు. ఇదంతా ఒక సరదా కలిగించే అనుభవమని చెప్పుకోవచ్చు.


ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుందని... ప్రతి ఒక్కరూ ఇంట్లోనే సమయాన్ని గడుపుతున్నారని అందరికీ తెలిసిందే. అయితే ఖాళీగా ఇంట్లో కూర్చున్న వారికి కాలక్షేపం కలిగించేందుకు గూగుల్ సంస్థ గూగుల్ డూడుల్ ద్వారా వినూత్నమైన గేమ్స్ లను అందిస్తుంది. గూగుల్ డాట్ కాం వెబ్ సైట్ విజిట్ చేసి పెద్దగా కనిపిస్తున్న గూగుల్ ఐకాన్ పై క్లిక్ చేస్తే మీరు ఈ బ్రేక్ మ్యూజిక్ గేమ్ ని ఆడవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: