అస‌లే ఏపీలో క‌రోనా గురించి అంద‌రూ ఆందోళ‌న ప‌డుతోన్న వేళ గురువారం తెల్ల‌వారు ఝామున న‌గ‌రంలోని గోపాల‌ప‌ట్నం స‌మీపంలో ఉన్న ఎల్జీ పాలిమ‌ర్స్ కంపెనీ నుంచి స్టెరీన్ అనే ర‌సాయ‌న వాయువు లీక్ అవ్వ‌డంతో న‌గ‌రం అంతా అత‌లా కుత‌లం అయిపోయింది. స‌మీపంలోని ఐదు గ్రామాల ప్ర‌జ‌ల‌కు తీవ్ర ఎఫెక్ట్ అయ్యింది. సుమారుగా 3 వేల మంది ప్ర‌జ‌లు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఈ ప్రాంతంలో ఉద‌యం రోడ్ల‌మీద‌కు వ‌చ్చిన వారిలో చాలా మంది ఉన్న‌వాళ్లు ఉన్న‌ట్టుగా ప‌డిపోయారు. బైక్‌ల మీద వెళుతున్న వాళ్లు వెళుతున్న‌ట్టుగా కుప్ప‌కూలిపోయారు. చివ‌ర‌కు విశాఖ కింగ్ జార్జ్ ఆసుప‌త్రి గ్యాస్ వాయువు బాధితుల అర‌ణ్య రోద‌న‌ల‌తో మార్మోగింది. 

 

ఇక సీఎం జ‌గ‌న్ ప్ర‌మాదం గురించి తెలిసిన వెంట‌నే త‌న‌కు అందుబాటులో ఉన్న మంత్రుల‌తో స‌మీక్ష పెట్ట‌డంతో పాటు హుటాహుటీన వైజాగ్ త‌ర‌లి వెళ్లారు. అక్క‌డ కింగ్ జార్జ్ ఆసుప‌త్రిలో బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన జ‌గ‌న్ చనిపోయిన వారిని వెనక్కు తీసుకురాలేక పోయినా, ఆ కుటుంబాలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నా అని చెప్పారు. ఇక ఈ దుర్ఘ‌ట‌న‌లో మృతి చెందిన వారికి ఊహించ‌ని విధంగా పరిహారం ఇచ్చి వారికి తాను ఉన్నానంటూ భ‌రోసా ఇచ్చారు. ఇక ఈ సంఘ‌న‌ట‌లో మృతుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం ఇస్తాన‌ని చెప్పిన జ‌గ‌న్‌... ఆస్పత్రుల్లో ప్రాధమికచికిత్సతో వెళ్లిపోయిన వారికి రూ.25 వేలు... అస్వస్ధతతో ఆస్పత్రుల్లో రెండు, మూడు రోజులు ఉండాల్సిన వారికి లక్ష రూపాయలు .... తీవ్ర అస్వస్ధతకు గురై వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షలు పరిహారం ప్ర‌క‌టించారు. 

 

ఓవ‌రాల్‌గా బాధితులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా వైద్యం చేయిస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే జ‌గ‌న్ స‌మీక్ష అనంత‌రం దీనిపై క‌మిటీ వేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు అలారం ఎందుకు మోగ‌లేద‌న్న విష‌యాన్ని జ‌గ‌న్ ప‌దే ప‌దే ప్ర‌స్తావించారు. ఆ అలారం ఎందుకు మోగ‌లేదో ?  అన్న విష‌యం చెపుతున్న‌ప్పుడు జ‌గ‌న్ క‌ళ్ల‌ల్లో తీవ్ర‌మైన ఉద్వేగంతో పాటు బాధ క‌నిపించింది. లోప‌ల బాధ‌ను పైకి అణుచుకుంటేనే జ‌గ‌న్ త‌న ప్రెస్‌మీట్ కంటిన్యూ చేశారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: