ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా విల‌యం సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే. అగ్ర‌రాజ్య అమెరికాతో పాటు ఇట‌లీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, బ్రిట‌న్‌, బ్రెజిల్‌, భార‌త్ ఇలా ప్ర‌పంచంలోని ఏదోవిధంగా ప్ర‌భావంత‌మైన దేశాల‌న్నింటిని క‌రోనా ప‌ట్టి పీడిస్తోంది. భార‌త్‌కు పొరుగున ఉన్న ఆసియా దేశాల‌న్ని కూడా క‌రోనాతో విల‌విలాడుతున్నాయి. పాకిస్థాన్ క‌కావిక‌లం అవుతోంది. దుర్బ‌ర ప‌రిస్థితుల్లో కూరుకుపోయిన పేద దేశం ఆఫ్ఝ‌నిస్థాన్‌లో క‌రోనాతో  అతిభ‌యంక‌ర ప‌రిస్థితులు రాబోతున్న‌ట్లు స‌మాచారం అందుతోంది. ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా బారిన పడే దేశాల్లో ఆఫ్ఘనిస్థాన్ ముందుండే అవకాశం ఉందని అంత‌ర్జాతీయ నివేదిక‌లు పేర్కొంటున్నాయి.


3.5 కోట్ల జనాభా కలిగిన ఆఫ్ఘనిస్థాన్ లో సుమారు 50 లక్షలకు పైగా జనాభా దేశ రాజధాని కాబూల్‌లోనే ఉంటుంది. అయితే లాక్‌డౌన్‌ను ఆల‌స్యంగా ఆరంభించిన ఈ దేశంలో మొద‌ట కేసుల సంఖ్య త‌క్కువ‌గానే న‌మోదైన‌ప్ప‌టికి ఇటీవ‌లి కాలంలో వేగంగా పెరుగుతూపోతున్నాయి. దీనికి తోడు ఈ దేశంలో తగినన్ని  వైద్య సదుపాయాలు లేకపోవడంతో క‌రోనా నియంత్ర‌ణ‌కు చ‌ర్య‌లు త‌క్కువ‌గా జ‌రుగుతున్నాయి. దీంతో  దేశ జనాభాలో దాదాపు 80 శాతం దాకా  కరోనా బారిన పడే ప్రమాదం ఉంద‌ని అంత‌ర్జాతీయ ఆరోగ్య స‌ర్వే నివేదిక‌లు వెల్ల‌డిస్తుండ‌టం ఆ దేశ పాల‌కుల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.


కాబూల్ లో ఇఫ్పటికే 500మందికి ర్యాండమ్ టెస్ట్ నిర్వహించగా, 50 శాతం మంది ఇన్‌ఫెక్షన్‌కు గురైనట్టు తేలిందని ఐవోఎం త‌న నివేదిక‌లో వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆఫ్ఘనిస్తాన్‌లో కొవిడ్19 పరీక్షలకు ఏర్పాటైన కేంద్రాలు 8 మాత్రమే అంటూ ఆశ్చ‌ర్యం వేయ‌క మాన‌దు.  వీటిలో రోజుకు 100 నుంచి 150 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉగ్ర‌వాదుల ప్ర‌భావం ఎక్కువ‌గా కొన‌సాగే ఈ దేశంలో ౩౦ శాతం ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించేందుకే అవకాశం లేకుండా పోతోంద‌ని అక్క‌డి వైద్యులు ఆరోగ్య సంస్థ‌ల‌కు వెల్ల‌డించార‌ట‌. మరోవైపు.. టీబీ, హెచ్‌ఐవి, పౌష్టికాహార లోపం, క్యాన్సర్, గుండె, శ్వాస సంబంధ వ్యాధులు ఆ దేశ ప్రజల్ని పీడిస్తున్నాయి. ఇప్పుడు క‌రోనాను ఎదుర్కోవ‌డం అన్న‌ది  ఆఫ్ఘన్ల‌కు అతిపెద్ద స‌వాల్ అనే చెప్పాలి. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: