ఉగ్రవాదులను భారత భూభాగంలోకి పెద్ద సంఖ్యలో చొప్పించేందుకు పాక్ కొద్దిరోజులుగా ముమ్మరయత్నాలు చేస్తోంది.  ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన భార‌త సైన్యం పాక్ కుతంత్రాల‌ను తిప్పికొట్ట‌డ‌మే కాదు..ఉగ్ర‌వాదులను మ‌ట్టుబెడుతూ వ‌స్తోంది. గడిచిన ఐదు నెలల్లో భార‌త ఆర్మీ మొత్తం 27 ఆపరేషన్ప్ నిర్వ‌హించిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో మొత్తం 64  మంది ఉగ్రవాదులు హతమయ్యారని అధికారికంగా తెలిపారు. “జనవరి నుంచి మే 6వ తేదీ వరకు మొత్తం 27 టెర్రర్ ఆపరేషన్స్ చేశాం. ఈ ఘటనలో 64 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మరో 25 మంది ఉగ్రవాదుల్ని సజీవంగా పట్టుకుని అరెస్ట్ చేశామ‌ని కశ్మీర్ రేంజ్ ఐజీ విజయ్ కుమార్ గురువారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

 

ఇక బుధ‌వారం భార‌త బ‌ల‌గాలు మోస్ట్ వాంటెడ్‌ ఉగ్రవాది, హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ కమాండర్ రియాజ్‌ నైకూను మ‌ట్టుబెట్టిన విష‌యం తెలిసిందే. కాగా.. గత మార్చి నెలలో కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిత్యం పాక్ ప్రేరేపతి ఉగ్రవాదులు దేశంలో అలజడి సృష్టించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. భార‌త్‌లోకి చొర‌బ‌డేందుకు ఇదే త‌గిన స‌మ‌య‌మ‌ని ఉగ్ర‌వాదులు యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే భార‌త ఆర్మీ మాత్రం పాక్ ఉగ్ర‌వాద మూక‌ల‌ను స‌రిహ‌ద్దు వ‌ద్ద మ‌ట్టుబెట్టేస్తూనే ఉంది. భార‌త్‌లో లాక్‌డౌన్ అమ‌ల్లోకి వ‌చ్చిన నాటి నుంచి దాదాపు ముప్పై మంది ఉగ్రవాదుల్ని సైన్యం కాల్చిచంప‌డం గ‌మ‌నార్హం.


 కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ తూట్లుపొడుస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలకు ఆ దేశ సైన్యం నుంచి పూర్తి స‌హ‌కారం అందుతోంది. ఉగ్ర‌వాదుల‌కు పెద్ద ఎత్తున న‌గ‌దును, ఆయుధాల‌ను స‌మ‌కూర్చుతున్న‌ట్లుగా ఇప్ప‌టికే ప‌లుమార్లు రుజువైన విష‌యం తెలిసిందే. తాజాగా ఆఫ్ఝ‌నిస్థాన్‌లోని ఉగ్ర‌వాదా శిబిరాల్లో  దాదాపు 400 మందికి  శిక్ష‌ణ ఇప్పించి భార‌త్‌లోకి పంపేందుకు య‌త్నిస్తున్న‌ట్లు నిఘా వ‌ర్గాలు ప‌సిగ‌ట్టాయి. ఆఫ్ఝ‌నిస్థాన్‌కు ఓ ఉగ్ర‌వాది చిక్క‌డంతో ఈ మొత్తం విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. భార‌త్‌లో దాడుల‌కు పాల్ప‌డేందుకు కుట్ర‌లు జ‌రుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం కూడా అన్ని రాష్ట్రాల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: