దేశంలో కరోనా వైరస్ ప్రవేశించిన ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం సాయం కింద 1.7 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించడం జరిగింది. కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ప్యాకేజీ ప్రకటించారు. అయితే రాష్ట్రాలు మాత్రం కేంద్ర ప్రభుత్వం….ఆదుకోవడం లేదని ప్రకటనలకే ప్యాకేజీలు ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో వరకు చేరడం లేదని వాపోతున్నాయి. కరోనా వైరస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో ఆదుకోవడం లేదని లాక్ డౌన్ వల్ల రాష్ట్రానికి ఆదాయం లేని సమయంలో కూడా కేంద్రం పెద్దగా స్పందించడం లేదని విమర్శిస్తున్నారు. మోడీతో సమావేశం లో కూడా చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది.

 

ఇటువంటి పరిస్థితుల్లో ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై సెస్ ను భారీగా పెంచిన నేపథ్యంలో త్వరలో ఆదాయం రాబోతుందని బిజినెస్ పత్రికలు రాస్తున్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వం ఖజానాలో ఏమీ లేకుండానే ప్రకటనలు చేస్తూ ఇప్పటిదాకా హడావిడి చేసిందన్న మాట అని తాజా పత్రికా ప్రకటన చూసి రాష్ట్ర ప్రభుత్వాలు షాక్ అవుతున్నాయి. అయితే ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స‌ల‌ను అందించ‌డం, క్వారంటైన్ సెంట‌ర్ల‌ను న‌డ‌ప‌డం.. ఇవ‌న్నీ కూడా రాష్ట్రాల భారంగానే ఉంది. ఆ విష‌యాల్లో కేంద్రం ఎలాంటి బాధ్య‌త‌ల‌నూ తీసుకోవ‌డం లేకపోగా మొత్తం భారమంతా రాష్ట్ర ప్రభుత్వాలపై వేసినట్లయింది.

 

మరోపక్క లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం లేకపోవటంతో మోడీ వేసిన స్కెచ్ పై మండిపడుతున్నాయి. మొత్తం భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పై వేసి ప్రకటనలకు పెద్ద హడావిడి తప్ప కరోనా వైరస్ విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరుపై ఇదేమి ప్లానింగ్ రా నాయనా అని అంటున్నాయి. అంతర్జాతీయంగా ముడి చ‌మ‌రు ధ‌ర‌లు ప‌డిపోయాయి. ఆ ప్ర‌యోజ‌నాలు భార‌త వినియోగ‌దారుల‌కు కలగకుండా పెట్రోల్, డీజిల్ పై కేంద్రం రేట్లు పెంచడంతో వాటి ప్రయోజనాలు రాష్ట్రాలకు ఇవ్వటాన్ని చాలామంది తప్పు పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: