విశాఖపట్టణానికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హుదూద్ తుఫాన్ వచ్చి చాలా నష్టపోగా తాజాగా వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నగరంలో ఎల్ జి సంస్థ నుండి గ్యాస్ లీకేజీ కావటంతో దాదాపు రెండు వేల మందికి పైగా శ్వాస తీసుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎల్ జి సంస్థ నుండి చుట్టుపక్కల దాదాపు ఐదు కిలోమీటర్ల మేరకు ఈ డేంజరస్ గ్యాస్ వ్యాపించడంతో మూగజీవాలు కూడా చనిపోవడం జరిగింది. ఇంత  ప్రమాదకరమైన గ్యాస్ లీకేజీ ఘటనపై ఎల్ జి సంస్థ స్పందించింది. దీనిపై విచారం వ్యక్తం చేసింది. లీక్ ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.

 

లాక్‌డౌన్ సడలింపులతో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్న సమయంలో నైట్ షిఫ్ట్ కార్మికుడు ట్యాంక్ నుండి లీక్‌ను గుర్తించినట్టు ఆ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం పట్టణవాసులకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని, ప్రజలను, తమ ఉద్యోగులను రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆ సంస్థ తెలిపింది. ఈ ప్రమాదంలో లీకైన వాయువు పీల్చినపుడు వికారంతోపాటు మైకం ఆవరిస్తుందని తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, వారికి చికిత్స పొందేలా చూడాలని కోరుతున్నట్లు పేర్కొంది.

 

కానీ మరోపక్క గ్యాస్ లీక్ విషయంలో చాలా రోజులు స్టోర్ చేసి రిలీజ్ చేసే విషయంలో యాజమాన్యం చెక్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం వాటిల్లినట్లు బాధితులు చెబుతున్నారు. ప్రస్తుతం వారు ఇస్తున్న వివరణ అబద్ధం అని అంటున్నారు. మామూలుగా అయితే చాలా రోజులు స్టోర్ అయిన తర్వాత కంపెనీ టెక్నీషియన్లు పనితనం పరీక్షించి అప్పుడు రిలీజ్ చేయాలని కానీ ఏమి ఆలోచించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇంత భారీ ప్రమాదం జరిగినట్లు సీక్రెట్ బయట పడింది. దీంతో ప్రభుత్వం ఎల్ జి సంస్థ పై ఎటువంటి చర్యలు తీసుకుంటుందో అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: