కరోనా గురించి మాట్లాడుకోవాలంటే కఠిన నిజాలు చాలా  ఒప్పుకుని తీరాల్సిందే. ఎందుకంటే కరోనా వైరస్ దేశంలో జోరుగా లేదు అంటున్నారు. కానీ లాక్ డౌన్ విధించినా కూడా యాభైవేల మార్క్ కి చేరింది. ఇదంతా కేవలం రెండు నెలల తేడాలోనే అంటే ఆశ్చర్యకరమే. మార్చి 5వ తేదీన 30 కేసులు ఉన్న కరోనా మే 5 నాటికి యాభై వేలకు చేరుకుందంటే ఈ దేశాంలో కరోనా ఎంత స్పీడ్ గా స్ప్రెడ్ అవుతోందో అర్ధం చేసుకోవాలి.

 

కరోనా కధ ఇంతటితో అయిపోలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇపుడు లాక్ డౌన్ ఉంది కాబట్టి నంబర్లు ఇలా ఉన్నాయని, అదే లాక్ డౌన్ ఎత్తేస్తే కరోనా తన అసలైన విశ్వరూపం చూపిస్తుందని అంటున్నారు. ముఖ్యంగా రానున్న కాలమంతా కరోనాదేనని కూడా అంటున్నారు.

 

అదేలా అంటే జూన్, జూలై నెలలు వానలు కురిసే సీజన్. ఆ టైంల్లో తేమ వాతావరణం ఎక్కువగా ఉంటుంది. దాంతో  కరోనా విస్తరించేందుకు ఎంతగానో అవకాశం ఉంటుందని అంటున్నారు. నిజంగా ఇది భారతీయులంతా భయపడాల్సిన వార్తే. రానున్న ఆరు వారాలు కరోనా వైరస్ కి అతి కీలకమని కూడా అంటున్నారు.

 

అయితే లాక్ డౌన్ వల్ల లభించిన అభ్యాసంతో భౌతిక దూరం పాటించాలని, ఆ విధంగా చేయడం వల్లనే కరోనా మహమ్మారిని కట్టడి చేయడం అవుతుందని కూడా సూచిస్తున్నారు. మొత్తం మీద చూస్తే కరోనాను దేశంలో ఆహ్వానించాలా వద్దా అన్నది పూర్తిగా జనం చేతిలో ఉంది. మరి కరోనాని తరిమేద్దాం అనుకుంటే మాత్రం కచ్చితంగా భౌతిక దూరం, మాస్క్ వంటివి పాటించాల్సిందే.

 

ఇది ఎవరో మనకు చెప్పి కట్టడి చేయడం రేపటి రోజున ఉండదు, మనలను అడ్డే పోలీస్ ఉండడు, ఆ సమయంలో మనకు మనమే స్వీయ రక్షణగా ఉండాలి. మనమే కరోనా వైరస్ ని ఎదిరించి అసలైన పోరాటం చేయాలి. అపుడే కరోనా కి అడ్డుకట్ట పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: