విశాఖలో గ్యాస్ లీకేజీ దుర్ఘటన నగర వాసులను వణికించింది. అదృష్టవశాత్తూ అతి తక్కువ నష్టంతో బయటపడ్డారు. అయితే ఈ వాయువు పీల్చి ప్రాణాలు దక్కించుకున్న వాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. స్టైరిన్ వాయువుకు గురైన వారు ఎక్కువగా కనిపించే లక్షణాలు ఏంటంటే.. చర్మంపై దద్దుర్లు, దురదలు, మంటలు పుడతాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగటం, శ్వాస ఆడకపోవటం జరుగుతుంది.

 

 

శ్వాస తీసుకునేటపుుడు ముక్కు, ఛాతీలో మంట వస్తుంది. నోటి నుంచి, ముక్కు నుంచి నురగలు వస్తాయి. తల నొప్పి వస్తుంది.. తల తిరగడం ఉంటుంది. వికారం, వాంతి వచ్చేలా ఉంటుంది. ఆపస్మారక స్థితికి వెళ్ళడం, సరిగ్గా నడవలేకపోవడం, తూలడం జరుగుతుంది.

కండరాల బలహీనత, నాడీ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది.

 

 

మరి స్టైరైన్ ను గురైన వారు ఏం చేయాలంటే.. వాయువు వెలువడిన ప్రాంతం నుంచి వెంటనే

సురక్షిత ప్రాంతానికి వెళ్లాలి. కళ్లను ఎక్కువ నీటితో కడగాలి. శరీరాన్ని నీరు లేదా సబ్బుతో కడుక్కోవాలి. తేలికపాటి లక్షణాలు కనిపించినప్పటికీ విస్మరించకూడదు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా.. స్పృహ కోల్పోయినా సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలి.

 

 

స్టైరైన్ వాయువుకు గురైన వారు ఏం చేయకూడదంటే.... ప్రభుత్వ అధికారులు మళ్లీ చెప్పేవరకూ కలుషిత ప్రాంతానికి వెళ్లకూడదు. వాంతి వస్తే సరే.. లేకపోతే.. వాంతి వచ్చేలా ప్రేరేపించుకోవద్దు.. ఇది మరింతగా రోగి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. స్టెరీన్ వాయువు పీల్చిన వారు ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: