లాక్ డౌన్ నేపధ్యం లో  కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలను ఆదుకోవడం లేదన్న విమర్శలు  విన్పిస్తున్నాయి . కేంద్రం ఒకవైపు సహాయం అందజేయడం మాట మర్చిపోయి , రాష్ర్టాల నుంచి పెట్రో ఉత్పత్తుల నుంచి పెద్దమొత్తం లో  సెస్ రూపంలో దండుకునే ప్రయత్నాలు చేస్తోంది . లాక్  డౌన్ కు ముందు  జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో రాష్ర్టాల నుంచి సెస్  పెంచి  వసూలు చేసుకునే   బిల్లుని కేంద్రం  ఆమోదించుకుంది .
 
దాన్ని ఇప్పుడు వినియోగం లోకి తెస్తున్నట్లు తెలుస్తోంది .రాష్ర్టాల నుంచి దాదాపు లక్షా 60  వేలకోట్ల  రూపాయలను పెట్రో  ఉత్పత్తులపై సెస్  రూపం లో  వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం  . కరోనా కట్టడికోసంకేంద్రం లాక్ డౌన్ ప్రకటించడంతో  రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయన్ని కోల్పోవాల్సిన పరిస్ధితి  నెలకొంది . అయినా  కేంద్రప్రభుత్వం మాత్రం , రాష్ర్టాలకు దన్నుగా నిలిచేందుకు తీసుకున్న  చర్యలు ఏమీ  లేవంటూ , విపక్ష పాలిత  రాష్ట్ర ప్రభుత్వాలు  విమర్శిస్తున్నాయి .
 
కనీసం ఎఫ్ ఆర్ బి ఎం పరిమితిని పెంచామని  కోరిన పట్టించుకోవడం లేదని  తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు  . కరోనా నేపథ్యంలో లాక్  డౌన్ కారణంగా  ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ర్టాలకు ప్రత్యేక ప్యాకేజీ  అన్నది ప్రకటించకుండా చోద్యం చూస్తోందని ఆయన  విరుచుకుపడ్డారు . అయితే ,  కెసిఆర్ కు పరిపాలన  చేతకాక , కేంద్రంపై విమర్శలు  చేస్తున్నారని కమలనాథులు ధ్వజమెత్తుతున్నారు .
 
కేంద్రం ఇప్పటికే  లక్షా 70  వేలకోట్ల ప్యాకేజీ  ప్రకటించిందని గుర్తు చేస్తున్నారు . అయితే  కేంద్రం  తాను ప్రకటించిన లక్షా  డెబ్భై వేలకోట్ల రూపాయలప్యాకేజీ నిదులను   కేంద్రం రాష్ట్రాల నుంచి తిరిగిరాబట్టుకునేందుకే పెట్రో  ఉత్పత్తులపై సెస్  పెంచాలని భావిస్తోందని రాజకియ పరిశీలకులు  విశ్లేషిస్తున్నారు .  
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: