మోడీ అంటేనే ఇపుడు పాక్ కి హడల్. చలి జ్వరం వచ్చేస్తోంది. కరోనా వేళ కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషించలని  పాక్ ఆలోచించడం పట్ల భారత్ ఘాటుగానే స్పందిస్తోంది. దానికి బాగానే బదులు తీర్చుకుంది. హిజ్బుల్ కీలక నేత రియాజ్ నైకూని హతమార్చిన భారత్ పాక్ పీచమణించేసింది.

 

అది చాలదు అన్నట్లుగా పాక్ విర్రవీగితే మరింత గట్టిగా బుద్ధి చెప్పేందుకు భారత్ రెడీ అవుతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీద ఇపుడు భారత్ కన్నేసింది. నిజానికి మోడీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాదేనని గత ఏడాది కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేసిన సందర్భంగానే చెప్పుకొచ్చారు. ఇపుడు దాన్ని స్వాధీనం చేసుకోవడానికి సమయం ఆసన్నమైందని తాజాగా  భారత్ భావిస్తోంది.

 

భారత్ లో పీఓకే భాగం అని చెప్పడానికి సూచికగా భారత వాతావరణ శాఖ అక్కడ కూడా వాతావరణ సూచనలు ఇస్తోంది. ఓ విధంగా ఆ ప్రాంతం మీద పట్టు సాధించేందుకు ఇది తొలి ఎత్తుగడగా చెబుతున్నారు. పాక్ దురాక్రమించిన పాక్ ఆక్రమిత కాశ్మీర్  కూడా కాశ్మీర్ ని విభజించినపుడు అందులో చేర్చిన భారత్ ఇపుడు అధికారికంగా పీఓకే మాది అంటోంది.

 

తాజాగా పీఓకే కి ఎన్నికలు జరిపించాలని పాక్ సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే దాన్ని భారత్ తప్పుపట్టింది. జమ్మూ కాశ్మీర్ డివిజన్లో పీఓకే ఒక భాగమని భారత్ అధికారికంగా ప్రకటిస్తోంది. ఈ పరిణామాలను చూసుకున్నపుడు రేపో మాపో మరో యుధ్ధం చేసైనా పీఓకేని భారత్ లో కలిపివేసేందుకు భారత్ సిధ్ధంగా ఉంటుందని తెలుస్తోంది. 

 

అదే కనుక జరిగితే భారత్ తన సత్తా ఏంటో ఒక్క పాకిస్థానే కాదు, యావత్తు ప్రపంచానికి తెలియచేసినట్లవుతుంది. నిజానికి చైనా ఇపుడు కరోనా వైరస్ తరువాత ఇబ్బందుల్లో ఉంది. పాక్ కి సాయం చేసే పరిస్థితుల్లో అసలు లేదు. ఇదే సరైన సమయం అని భారత్ భావిస్తే కనుక కొద్ది కాలంలోనే పీఓకే కూడా కాశ్మీర్లో చేరిపోయి భారత్  లో సంపూర్ణంగా విలీనం అవడం ఖాయం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: