విశాఖ గ్యాస్ లీకేజ్ పై రాజకీయం మొదలైంది. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దరిద్రం మొదలైందని టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని వైసీపీ వాళ్ళు ఫైర్ అయిపోతున్నారు. అటు చంద్రబాబే గ్యాస్ లీకేజ్ చేయించారని వైసీపీ కార్యకర్తలు పనికిమాలిన విమర్శలు చేస్తున్నారని టీడీపీ వాళ్ళు అంటున్నారు.

 

తాజాగా చంద్రబాబు గ్యాస్ లీకేజ్ చేయించారంటూ చౌకబారు విమర్శలు చేస్తున్నారని టీడీపీ నాయకురాలు దివ్యవాణి మండిపడ్డారు. చంద్రబాబుపై పెడుతున్న దృష్టి ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు సహాయం అందించడంపై పెట్టాలని వైసీపీ నేతలను కోరుతున్నానని అన్నారు. అయితే ఇక్కడ టీడీపీ వాళ్ళు,  జగన్ అధికారంలోకి వచ్చాక దరిద్రం మొదలైందని ఎప్పటి నుంచో పోస్టులు పెడుతూనే ఉన్నారు. కానీ చంద్రబాబు గ్యాస్ లీకేజ్ చేయించారని వైసీపీ కార్యకర్తలు అంటున్నట్లు ఎక్కడా కనపడలేదు. లేనిపోని దానిని ఊహించుకుని దివ్యవాణి ఆవేశ పడ్డారని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు.

 

ఇలాంటి విపత్తు సమయంలో రాజకీయం చేసేది టీడీపీనేనని, తాము లేనిపోనీ ఆరోపణలు చేయమని, అందులో నిజానిజాలు ఉంటేనే ఆరోపణలు చేస్తామని చెబుతున్నారు. టీడీపీ నేతలు కావాలనే, రాజకీయ లబ్ది పొందడానికి ఇలా రివర్స్ లో మాట్లాడుతున్నారని అంటున్నారు.

 

అయితే ఇదే సమయంలో నారా లోకేష్, వైసీపీ కార్యకర్తలు విష ప్రచారం చేస్తున్నారంటూ ఓ పోస్ట్ పెట్టారు. క‌నీస మాన‌వ‌తాదృక్ప‌థం లేకుండా ప్రాంతీయ విద్వేషాలు రేపేలా ఫేక్ ట్వీట్లు వేసి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారని ఆరోపించారు. దొంగ‌త‌నాలు, దోపిడీలు చేయ‌డం, విద్వేషాలు రాజేయ‌డం త‌ప్పించి ట్విట్ట‌ర్ అకౌంట్ యూజర్ నేమ్ 15 అక్ష‌రాలు దాటి తీసుకోద‌ని క‌నీస ఇంగిత‌జ్ఞానం లేదని, పోనీ ట్విట్ట‌ర్లో ఆ ఖాతా ఉందా అంటే అదీ లేదని.. డ‌బ్బులిస్తామంటే క‌న్న‌త‌ల్లిని కూడా చంపేసే టైపు పేటీఎం బ్యాచులే ఇటువంటి విద్వేషాలు పెంచే విష‌ప్ర‌చారానికి దిగుతాయన్నారు.

 

అసలు ఏమైందంటే మై క్యాపిటల్ అమరావతి పేరిట సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వచ్చింది. దేవుడు ఉన్నాడు రా అని అంటూ..అమరావతికి అన్యాయం జరగడం వల్లే, వైజాగ్ వాళ్లకు ఇలా జరుగుతుందని టీడీపీ కార్యకర్త పోస్ట్ పెట్టినట్లు వచ్చింది. అయితే అది వైసీపీ వాళ్లే ఎడిట్ చేసి, ఇలా క్రియేట్ చేసారని, అసలు అకౌంట్ యూజర్ నేమ్ 15 అక్ష‌రాలు దాటి తీసుకోద‌ని, కానీ ఆ అకౌంట్ పేరు 15 అక్షరాలు దాటి ఉంది. దీంతో లోకేష్ ఈ విషయాన్ని బయటపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: