రాష్ట్రం విడిపోయాక ఏపీ ఆర్ధిక పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఎంత లోటు బడ్జెట్ లో ఉందో గత ఐదేళ్లు చంద్రబాబు చెబుతూనే ఉన్నారు. అలాగే చంద్రబాబు ఎన్ని అప్పులు చేసారో కూడా తెలుసు. ఇక అలాంటి పరిస్థితుల్లో జగన్ అధికారంలోకి వచ్చి పాలన మొదలుపెట్టారు.

 

కాకపోతే ఎన్ని ఇబ్బందులు ఉన్నాసరే ఆయన..దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు ప్రజలకు అందించారు. సంవత్సరం లోపే మేనిఫెస్టోలో ఉన్న హామీలని దాదాపు అమలు చేసారు. అయితే రాష్ట్ర పరిస్థితి నిదానంగా సెట్ అవుతుందనుకునే సమయంలోనే, కరోనా వచ్చి పడింది. దాని వల్ల లాక్ డౌన్ మొదలైంది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో కూడా జగన్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా, ఓ వైపు కరోనాని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తూనే, మరోవైపు ప్రజలని ఆదుకునే ప్రయత్నం చేసారు.ఇక ఈ కరోనా ప్రభావం ఉండగానే, కొన్ని కీలక పథకాలు కూడా ప్రజలకు అందించారు.

 

ఇలా ప్రజలకు ఎంత చేస్తున్నారో తాజాగా ఆర్ధిక మంత్రి బుగ్గన చెప్పిన లెక్కల్లో తేలింది. ప్రజా సంక్షేమానికి ప్రతి నెలకు రూ.300 కోట్లు అదనపు ఖర్చులు అవుతున్నాయని తెలిపారు. అంటే సాధారణంగా పెట్టే ఖర్చు కంటే అదనంగా 300 కోట్లు అవుతున్నాయి. దీని బట్టే జగన్ ప్రజల కోసం ఎంత చేస్తున్నారో అర్ధమవుతుంది.

 

ఇదే సమయంలో కరోనా కట్టడి చేయడంలో జగన్ ఫెయిల్ అయ్యారంటూ మాట్లాడుతున్న చంద్రబాబుకు కూడా బుగ్గన ఓ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఎంతో అనుభవమున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వేరే రాష్ట్రంలో కూర్చొని ఏపీలో కోవిడ్-19‌ టెస్టింగ్‌ చేయడం లేదని విమర్శించడం సిగ్గుచేటని, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ వారు కరోనా టెస్టింగ్‌లో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉందని తెలిపిన విషయం చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. అయితే ఈ విషయంపై ఎంత క్లారిటీ ఇచ్చిన కూడా బాబు విమర్శలు మాత్రం ఆపడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: