తెలంగాణ‌లో పెండింగ్‌లో ఉన్న ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌పై ఇప్పుడు అంద‌రి దృష్టి ప‌డింది. లాక్ డౌన్‌తో వాయిదా పడిన టెన్త్ పరీక్షలను ఈ నెలలో నిర్వ‌హించ‌నున్న‌ట్లు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ నెలాఖ‌రు నుంచి నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహణపై హైకోర్టులో అఫిడవిట్ వేయాల్సి ఉన్న నేప‌థ్యం ఓవైపు మ‌రోవైపు క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో ప‌క‌డ్బందీగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం మ‌రోవైపు ఉండ‌టంతో ఉన్న‌తాధికారులు ప‌క్క‌గా ప్ర‌ణాళిక‌లు చేస్తున్నారు.

 

తెలంగాణ‌ రాష్ట్రంలో మార్చి 19న టెన్త్ పరీక్షలు మొదలయ్యాయి. కేవలం 3 పేపర్లకు ఎగ్జామ్స్ కాగానే లాక్ డౌన్  ప్రకటిచడంతో వాయిదా పడ్డాయి. 5,34,903 మంది స్టూడెంట్లుపరీక్ష లు రాయనున్నారు. పరీక్షలను ఈ నెలాఖరున నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టెన్త్ ప‌రీక్ష‌కు ఏర్పాట్లు చేయాల‌ని విద్యా శాఖ స్పెష ల్ సీఎస్ చిత్రా రామ‌చంద్రన్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్, పరీక్షల విభాగం డైరెక్టర్ స‌త్యనారాయణ రెడ్డిలతో కలిసి ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీఈఓలు, డీఐఈఓలతో మాట్లాడారు. ఇంటర్ స్పాట్ నిర్వహణకు కూడా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

 

కాగా క‌రోనా నేప‌థ్యంలో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకొని పరీక్ష‌లు నిర్వ‌హించే ఏర్పాట్లు చేస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించేలా  ఒక్కో బెంచ్‌పై ఒక్కో విద్యార్థిని మాత్రమే కూర్చోబెట్టాలని నిర్ణయించారు. ఒక్క గ‌దిలో కేవలం 12 మంది విద్యార్థులే పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ప్రస్తుతమున్న 2,530 సెంటర్లను  రెట్టింపు చేసే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఒక్కోసెంటర్లో ఎంత మంది ఎగ్జామ్స్ రాసేందుకు వీలుంది? సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఎగ్జామ్స్ పెడితే ఇంకా ఎన్ని రూమ్లు కావాలి? ప్రస్తు సెంటర్లో ఎన్నిరూమ్లు ఖాళీగా ఉన్నాయి? ఎంత మంది ఇన్విజిలేటర్లు అవసరమవుతరు? వంటి వివరాలతో ఒకట్రెండు రోజుల్లో నివేది క ఇవ్వాల్సిం దిగా డీఈవోలకు అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఆ వివరాలను హైకోర్టుకు అందజేసి, పరీక్షల నిర్వహణకు అనుమతి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: