చంద్రబాబు మోడీ సూపర్ జోడీ అన్నది ఆరేళ్ళ క్రితం మాట. మోడీని దేశంలో అధికారంలో లేకుండా చేస్తాను అన్నది రెండేళ్ల క్రితం మాట. మోడీ ఈ దేశంలో బాగానే కరోనాను కట్టడి చేశారు. ఆయాన్ గూడ్ అంటూ కితాబులు ఇవ్వడం ఈనాటి మాట. మోడీ వైపు నుంచి బాబును ఎలా చూస్తున్నారో తెలియదు కానీ బాబు వైపు నుంచి మాత్రం మోడీని ఇన్ని కోణాల్లో చూశారు, ఇంకా వీలుంటే మరిన్ని కోణాల్లో కూడా చూస్తారు కూడా.

 

సరే చంద్రబాబు నెల్లన్నరగా హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆయన సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటున్నారని వైసీపీ నేతలు ఓ వైపు విమర్శలు చేస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే విశాఖలో గ్యాస్ లీక్ ఘటన తరువాత చంద్రబాబు హఠాత్తుగా విశాఖ రావాలనుకున్నారు. ఆయన విశాఖ వచ్చి బాధితులను పరామరిస్తారట. దాని కోసం, తన ప్రత్యేక విమానం కోసం కేంద్ర హోం శాఖకు అనుమతి కోరుతూ బాబు లేఖ రాశారు.

 


బాబు వరకూ చూస్తే అది బాధ్యత అనుకోవచ్చు. కనీ మిగిలిన వారికి మాత్రం అది రాజకీయం అనిపించినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే జగన్ సీఎం హోదాలో విశాఖ వచ్చారు. బాధితులను పరామర్శించారు. చనిపోయిన వారికి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు ప్రకటించారు. ఇక ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారికి పది లక్షలు పదిహేను వేలు ఉన్న వెంకటాపురంలో ప్రతీ గ్రామస్తుడికి పదివేల రూపాయలు సాయం ప్రకటించారు.

 

మరి ఇన్ని విధాలుగా జగన్ ఆదుకున్న తరువాత సహాయ చర్యలు ముమ్మరంగా చేసిన తరువాత బాబు వచ్చి మాత్రం ఏంచేస్తారు. ఇదే ఆలోచన కనుక కేంద్రానికి వస్తే ఆయన విశాఖ టూర్ కి అనుమతి ఇవ్వకపోవచ్చు. అయితే బాబుతో దోస్తీ చేయాలని బీజేపీ కనుక అనుకుంటే ఆయనకు అనుమతి ఇవ్వనూ వచ్చు. మొత్తానికి బాబు విశాఖ టూర్ లో రాజకీయాలే బయటపడతాయన్నది మాత్రం నిజమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: