కరోనా వైరస్ దెబ్బకి చాలా మందికి ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. గుంపులు గుంపులు గా తిరిగే పరిస్థితి లేకపోవడంతో భవిష్యత్తులో భారతదేశం లో ఉద్యోగాలు కొన్ని కోట్లల్లో కోల్పోతున్నట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. ఇటువంటి సమయంలో ఇంటి లోనే ఉంటూ లేడీస్ సూపర్ బిజినెస్ చేసే ఒక అరుదైన అవకాశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇటీవల ఓ వెబ్ సైట్ లో రోజ్ వాటర్ ఏవిధంగా తయారు చేసుకోవచ్చు దాని ద్వారా రోజుకి 1000 రూపాయలు ఎలా సంపాదించవచ్చు అనేదాని గురించి చాలా చక్కగా వివరించారు. ఇంట్లోనే ఉంటున్నా ఆడవాళ్ళు దీని గురించి తెలుసుకుంటే దాదాపు ఒక పక్క కుటుంబాన్ని పోషించుకుంటూ నే మరోపక్క ఆర్థికంగా సంపాదించుకునే అవకాశం ఉంది.

 

రోజ్ వాటర్ ఇంటిలోనే తయారు చేసే విధానం గురించి తెలుసుకుంటే కావాల్సిందల్లా రోజ్ పెట‌ల్స్ (గులాబీ పూల రెక్క‌లు), డిస్టిల్ వాట‌ర్‌, గ్యాస్ క‌నెక్ష‌న్ ఉంటే చాలు. అలాగే త‌యారు చేసిన రోజ్ వాట‌ర్‌ను ప్యాక్ చేసి విక్ర‌యించేందుకు 50, 100, 250 ఎంఎల్ సైజుల్లో ఉండే బాటిల్స్ కావాలి. ఇక వాటిని ప్యాక్ చేసేందుకు కార్ట‌న్స్ ఉండాలి. రోజ్‌వాట‌ర్‌ను సాధార‌ణంగా ప‌రిశ్ర‌మ‌ల్లో అయితే స్టీమ్ డిస్టిలేష‌న్ అనే ప్ర‌క్రియ ద్వారా త‌యారు చేస్తారు. కానీ ఇండ్ల‌లో రోజ్ పెట‌ల్స్‌ను నీటిలో మ‌రిగించి త‌యారు చేయ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో 1 కిలో రోజ్ పెట‌ల్స్ ద్వారా 10 లీట‌ర్ల రోజ్ వాట‌ర్ త‌యారు చేయ‌వ‌చ్చు.

 

ఇందుకు 3 గంట‌ల వ‌ర‌కు స‌మ‌యం ప‌డుతుంది. ఇక ఇలా త‌యారైన రోజ్ వాట‌ర్‌ను భిన్న ర‌కాల సైజుల్లో ఉండే బాటిల్స్‌లో నింపి అనంత‌రం ఆ బాటిల్స్‌ను కార్ట‌న్స్‌లో ప్యాక్ చేసి విక్ర‌యించాలి. ఇదే సమయంలో మార్కెట్ లో రోజ్ వాట‌ర్ బాటిల్ ధ‌ర చూస్తే భారీగానే పలుకుతోంది. ఈ విధంగా  250 ఎం.ఎల్ బాటిల్ ధర విషయానికొస్తే  45 రూపాయలు పలుకుతుంది. ఎలా చూసుకున్నా గాని నెలకి 30000 సంపాదించుకునే అవకాశం ఈ వ్యాపారంలో ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: