ఆంధ్రప్రదేశ్ సుందర నగరం విశాఖ పట్టణానికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కరోనా వైరస్ రాష్ట్రంలో వచ్చిన సమయంలో ఎక్కువ కేసులు నగరంలో నమోదు కావడంతో...విశాఖపట్టణం పరిస్థితి ఇంకా అయిపోయినట్లే అని అందరూ అనుకున్నారు. అనూహ్యంగా ప్రభుత్వం ఎక్కడికక్కడ చర్యలు చేపట్టడంతో చాలావరకు విశాఖపట్టణంలో కరోనా వైరస్ కంట్రోల్ అయింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ప్రజలంతా లాక్ డౌన్ పార్టీ ఇస్తున్న తరుణంలో విశాఖ లో జరిగిన గ్యాస్ లీకేజీ  కొన్ని వేల మందిని అస్వస్థతకు గురి చేసింది. ఎల్ జి సంస్థ కి సంబంధించిన కంపెనీలో విషవాయువులు తెల్లవారుజామున లీక్ కావడంతో చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు తీవ్రస్థాయిలో ఊపిరి తీసుకోవడానికి అనేక తంటాలు పడ్డారు.

 

అసలు ఏం జరుగుతుందో అన్న దాని విషయంలో క్లారిటీ లేని సమయంలో నిద్రలో ఉన్న వాళ్ళు చాలామంది స్పృహ కోల్పోవడంతో గ్రామానికి చెందిన యువకులు ఆపద్బాంధవులుగా మొత్తం గ్రహించి హుటాహుటిన చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు మరియు యువకులంతా కలిసి గ్రామాల్లో తలుపులు బద్దలు కొట్టి మొత్తం అందరిని ఖాళీ చేయించారు. అంత భయంకరమైన విష వాయువు రిలీజ్ అయినా గాని ప్రాణ నష్టం తక్కువగా జరగడానికి కారణం చూస్తే గ్రామాల్లో ఉన్న యువకులు పోరాడిన తీరు నిజంగా చాలా మంది కుటుంబాల ప్రాణాలను కాపాడింది అని స్థానికులు చెబుతున్నారు.

 

ఆ తర్వాత పోలీసులు సైరన్ మోగించిన గ్రామాల్లో నిద్రలో ఉన్న వారిని లేపడంతో చాలా వరకూ పరిస్థితి కంట్రోల్ అయిందని గ్రామ ప్రజలు చెబుతున్నారు. మొత్తంమీద చూసుకుంటే ప్రభుత్వ యంత్రాంగానికి ముందు గ్రామంలో ఉన్న యువకులు పోరాడిన పోరాటానికి గ్రామ ప్రజలు చేతులెత్తి దండం పెడుతున్నారు. ప్రస్తుతం గ్యాస్ వల్ల అస్వస్థతకు గురైన చాలామంది ఆసుపత్రి లలో త్వరగానే కోలుకుంటున్నారు. ఎవరూ ఊహించని విధంగా మృతులకు సీఎం జగన్ కోటి రూపాయల ఎక్సగ్రేషియా ప్రకటించడంతో… మనసున్న ముఖ్యమంత్రి అని చాలామంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: