విశాఖ శివార్లలోని ఎల్ జి పాలిమర్స్ నుంచి లీక్ అయిన విష వాయువు కారణంగా పది మంది వరకూ మృతి చెందారు. మరో 300 మంది వరకూ ఆసుపత్రుల్లో చేరారు. వారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉంది. ఉదయం ప్రమాద ఘటన వార్తకు సంబందించిన ఫోటోలు, వీడియోలు ప్రసారం కాగానే.. విశాఖలో భారీ ప్రాణ నష్టం తప్పదేమో అన్న ఆందోళన అందరిలోనూ కనిపించింది. అయితే పది మంది ప్రాణాలు కోల్పోవడం చిన్న నష్టం కాకపోయినా.. ఊహించినంత భారీ ఉత్పాతం కాకపోవడం కాస్త ఊరట కలిగించింది.

 

 

అయితే.. విశాఖవాసులకు మరో ప్రమాదం పొంచి ఉంది. అదేంటంటే.. ఇప్పుడు ఈ గ్యాస్ ప్రమాదం నుంచి బయటపడినా... ఆ గ్యాస్ ప్రమాదం వారిపై చాలా కాలం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎల్ జి పాలిమర్స్ నుంచి లీక్ అయిన గ్యాస్ సైరీన్.. దీని రసాయన నామం C8H8. ప్లాస్టిక్, సింథెటిక్ రబ్బర్ తయారీలో వాడతారు. వైజాగ్ లో లీకైన గ్యాస్ ను స్టైరీన్ గ్యాస్ గా చెబుతున్నారు.

 


ఈ గ్యాస్ ను పీల్చినపుడు ఏమవుతుందని కనుగొనేందుకు ఫ్యాక్టరీలలోని కార్మికుల మీద ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందని చాల మంది పరిశోధకులు పరిశీలించారు. మరొక విషయం ఏమంటే సిగరెట్ పొగలో కూడా కొంత మోతాదులో స్టైరీన్ ఉంటుంది. ఇది క్యాన్సర్ ను తెస్తుందని కొన్ని పరిశోధనలలో శాస్త్రవేత్తలు చెప్పారు. స్టైరీన్ గొంతులోకి మ్యూకస్ పొర మీద పనిచేస్తుంది. ఇది శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది సెంట్రల్, ఫెరిఫరల్ నర్వస్ సిస్టమ్ మీద పడుతుంది.

 

 

ఈ వాయువు పీల్చడం వల్ల నాడీ వ్యవస్థ మీద కిడ్నీల మీద ప్రభావం చూపుతుంది. తల నొప్పి వచ్చే అవకాశము ఉంటుంది. డిప్రెషన్ కు దారితీస్తుంది. అలసట.. బలహీన పడడం.. వినికిడి కోల్పోవడం జరుగుతుంది. ఏకాగ్రత కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: