దేశంలో దాదాపు 40 రోజులకు పైగా మద్యం షాపులు ఓపెన్ అవ్వకపోవటం తో మందుబాబులు అనేక అవస్థలు పడ్డారు. కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో దేశంలో మద్యం షాపులన్నీ బందు అయిపోయాయి. ఈ పరిణామంతో కొన్ని చోట్ల ప్రజలు బానే ఉన్నా మరికొంతమంది మందు లేకపోవటంతో పిచ్చి ఆసుపత్రి పాలయ్యారు. మానసికమైన వ్యాధులు రావడంతో చాలా వరకు మందుబాబులు ప్రభుత్వాలని ఓపెన్ చేయాలని కోరాటం జరిగింది. చాలా వరకు 40 రోజులకు పైగా మద్యం లేకపోయినా గానీ మందుబాబులు ఉండటంతో… తమని తాము కంట్రోల్ చేసుకోగలమని ప్రూవ్ చేశారు. దీంతో మందు విషయంలో ప్రజలు గెలిచినట్లయితే ప్రభుత్వాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.

 

అయితే మీరు తాగకపోతే మేము బతకలేము అన్నట్టుగా ప్రభుత్వాలు వ్యవహరించడంతో దేశవ్యాప్తంగా మందు దుకాణాలు ఓపెన్ అయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో ఓపెన్ అవ్వటంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే మహారాష్ట్రలో కరోనా వైరస్ విషయంలో ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇలాంటి విషయంలో ప్రజల ప్రాణాలను లెక్కచేయకుండా ప్రభుత్వాలు వ్యవహరించడంతో ఆ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకుల పై దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి.

 

మహారాష్ట్రలో మందు కోసం కిలోమీటర్ల మేర లైన్లో ప్రజలు నిలబడ్డా వీడియోలు దర్శనమిస్తున్నాయి. ఇలాగైతే మహారాష్ట్ర లో మందు తో పటు కరోనా కూడా ఫ్రీగా మద్యం షాప్ లో దొరుకుంతుంధీ అని అంటున్నారు. మరోపక్క కరోనా వైరస్ విషయంలో ప్రజలు ఆరోగ్యమే ముఖ్యం డబ్బులు తర్వాత సంపాదించుకోవచ్చు అన్న నాయకులు కూడా చేతులెత్తేసి మద్యం షాపులు ఓపెన్ చేసారు. దీంతో మద్యం మహమ్మారి పై ప్రజలు గెలిచినా, ప్రభుత్వాలు ఓడిపోయాయి. మొన్నటి వరకు ప్రజల ప్రాణాలు అన్ని ప్రభుత్వాలు కాకమ్మ కబుర్లు చెప్పి ఒక్కసారిగా మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వడంతో దేశవ్యాప్తంగా ఉన్న ఆడవాళ్ళు మరియు పిల్లలు మద్యం షాపులు క్లోజ్ చేయాలని కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: