మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలను ఎవరికీ చెప్పకుండా సొంత నిర్ణయంతో వాయిదా వేయడంతో అప్పట్లో జగన్ సర్కార్ కి దిమ్మతిరిగే షాక్ ఇవ్వటం మనకందరికీ తెలిసిందే. అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ కూడా ఏకంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వాడు అని ఇద్దరూ కలిసి కుట్రపూరితంగా ఎన్నికలను వాయిదా వేయడం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేయడం అప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనాలు సృష్టించింది. ఇటువంటి సమయంలో జగన్ సర్కార్ కొత్త ఆర్డినెన్స్ తీసుకువచ్చి రమేష్ కుమార్ పదవి  ఆటోమేటిక్ గా పోయే విధంగా వ్యవహరించడంతో ఆయన స్థానంలో మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ ను నియమించేసింది.

 

దీంతో ఈ వ్యవహారం హైకోర్టు గడప తొక్కింది. ఇదిలా ఉంటే.. ఎన్నికలను వాయిదా వేసిన తనకు భద్రత కల్పించాలంటూ నిమ్మగడ్డ కేంద్ర హోం శాఖకు రాసిన లేఖపై పెను దుమారమే రేగింది. ఈ లేఖ విషయంలో సిఐడి విచారణ జరుగుతున్న తరుణంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ నుండి పొంతన లేని సమాధానాలు రావడం జరిగింది.

 

దీంతో సిఐడి ఆయన పిఎస్ సాంబమూర్తి విచారించడంతో విచారణలో సిఐడి వేసిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోవడం తో ఈ విషయం న్యాయస్థానం దాకా వెళ్లటంతో ఆ పాయింట్ మీద నిమ్మగడ్డ నీ మళ్లీ సిఐడి విచారించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని Cid అధికారి సునీల్ కుమార్ కూడా చెప్పుకొచ్చాడు. మరోపక్క నిమ్మగడ్డ రమేష్ కుమార్.. వైసీపీ సర్కార్ వేధిస్తోందని తనకి రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని కోరారు. ఇటువంటి సమయంలో సిఐడి విచారణ కోరాటంతో ఈ విషయంలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ ప్రతి ఒక్కరిలో నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: