ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ నగరం దగ్గర్లోని ఆర్ఆర్ వెంకటాపురం లో ఉన్న ఎల్ జి పాలిమర్స్ పరిశ్రమలో ఉదయం జరిగిన ప్రమాదంలో లో విషపూరితమైన రసాయన వాయువులు భారీగా లీక్ అయి గురువారం వేకువజామున 11 మందిని మట్టు పెట్టిన విషయం తెలిసిందే. మరొక 120 మంది చికిత్స పొందుతుండగా విష వాయువులు మూడు నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాలలో ఎంతో మంది అస్వస్థతకు గురి చేసి వాటిని అధిక మొత్తంలో పీల్చిన వారికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను తెచ్చిపెట్టింది.

 

రోజంతా దేశవ్యాప్తంగా అతి పెద్ద సంచలనం సృష్టించిన ఘటన జరిగి 24 గంటలు కాకముందే మరలా రెండవసారి పరిశ్రమలో ప్రమాదం జరిగిన చోటు నుండి అధిక మొత్తంలో రాత్రి గ్యాస్ రిలీజ్ కావడం మొదలుపెట్టింది. విషయం పై విశాఖపట్నం జిల్లా అగ్నిమాపక అధికారి సందీప్ ఆనంద్ మాట్లాడుతూ.... ఎన్డీఆర్ఎఫ్ సపోర్టుతో అగ్నిమాపక సిబ్బంది 50 మంది కలిసి లోపల ఉన్న మంటలను ఆర్పేందుకు మరియు గ్యాస్ లీకేజీ కాకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని తెలిపారు.

 

అంతేకాకుండా ఫ్యాక్టరీకి 2-3 పరిధిలో ఉన్న గ్రామాల్లో అన్నింటిని అక్కడి నుండి ఖాళీ చేయిస్తున్నట్లు కూడా తెలిపారు. ఇంకా పరిశ్రమలో ఎక్కడ తప్పు జరిగి గ్యాస్ లీక్ అయింది అన్న విషయం పైన కానీ దానిని పూర్తిగా ఎలా అదుపు చేయాలి అనే విషయం పైన కానీ ఎటువంటి క్లారిటీ లేదన్న విషయం అర్థమవుతుంది. ఇకపోతే ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఘటనా స్థలం వద్దకు వెళ్లి అధికారులతో చర్చించి తర్వాత ఆస్పత్రిలో ఉన్న పేషెంట్లు అందరిని స్వయంగా వెళ్లి కలిశారు. చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించిన జగన్ చికిత్స తీసుకుంటున్న వారికి మరియు విష వాయువులు పీల్చిన ప్రతి ఒక్కరికి నష్టపరిహారాన్ని కూడా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: