పోలీసులను షాక్ కి గురి చేసిన ఘటన కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది.. అసలు ఏమైంది అంటే? ఓ 5 ఏళ్ల బాలుడు కారు వేసుకొని కాలిఫోర్నియాకు బయలుదేరాడు.. బాగా నడుపుకుంటూ వెళ్లి హైవేపై పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు కనిపించడు.. పోలీసులు షాక్ అయ్యి.. ఆ బాలుడుని పట్టుకొని అసలు ఏమైంది అని అడగగా.. ఓ సిల్లీ అండ్ షాకింగ్ విషయం బయటపడింది.

 

అసలు అది ఏంటి అంటే? ఆ ఐదేళ్ల బాలుడు తన తల్లికి ఖరీదైన లంబోర్గిని కారు కొనివ్వాలి అని ఒత్తిడి చేశాడు.. దీంతో ఆమె కుదరదు అని చెప్పింది.. కాసేపు తల్లితో గొడవపడ్డాక.. సైలెంట్ అయ్యాడు.. కానీ కొద్దిసేపటికి ఈ 5ఏళ్ల బుడ్డోడు తనకు కావాల్సింది దక్కాల్సిందేనని ఇంటి షెఢ్‌లో ఉన్న SUVకారు డ్రైవ్ చేసుకుంటూ లంబోర్గిని కారుని కొనేందుకు కాలిఫోర్నియాకు బయల్దేరాడు.

 

ఆతర్వాత నాలుగు కిలోమీటర్లు వెళ్ళాడో లేదో పోలీసుల కంటపడ్డాడు.. దీంతో పోలీసులు ఎక్కడికి వెళ్తున్నావ్? ఎందుకు వెళ్తున్నావ్? అసలు డ్రైవింగ్ ఎవరు నేర్పారు అని అడగగా.. లంబోర్గిని కారుని కొనేందుకు కాలిఫోర్నియాకు వెళ్తున్నట్టు.. కారు డ్రైవింగ్ తల్లి నేర్పించింది అంటూ సమాధానం ఇచ్చాడు.. ఇంకా లంబోర్గిని కారుని కొనేందుకు డబ్బులు ఉన్నాయా అంటే '' కొంచెం తక్కువ ఉన్నాయి అని.. అతడి దగ్గర 3 డాలర్లు'' ఉన్నాయ్ అని చెప్పాడు. దీంతో కారు ప్రమాదం డేంజర్ అని అతన్ని మందలించి తల్లితండ్రులకు అప్పగించారు పోలీసులు.. లాక్ డౌన్ వేల ఇలాంటి వింతలు కూడా జరుగుతున్నాయి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: