కరోనా వైరస్ ప్రభావితం వల్ల చరిత్రలో ఎన్నడూ జరగని lవి కూడా ప్రస్తుతం జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆలయాల విషయంలో అయితే ఎప్పుడూ మూసివేయబడని  ఆలయాలు ప్రస్తుతం ఉన్న వైరస్ ప్రభావం కారణంగా మూసివేయబడుతున్నాయి . ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం. గతంలో బ్రహ్మం గారు కాలజ్ఞానంలో  తిరుమల తిరుపతి దేవస్థానం మూసివేయబడుతుంది అని చెప్పారు. చెప్పిన విధంగానే కరోనా వైరస్ ప్రభావం వల్ల దాదాపు నెల రోజులకు పైగా తిరుమల తిరుపతి దేవస్థానం మూసివేయబడింది. భక్తులను ఎవరిని తిరుమల తిరుపతి దేవస్థానంలో కి అనుమతించలేదు. ఇలా తిరుమల ఆలయాన్ని  మూసివేయడం తిరుమల చరిత్రలోనే మొదటి సారి అని చెప్పవచ్చు. 

 

 

 ఇక తాజాగా మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో. తాజాగా టిటిడి  ఫైనాన్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు అధికారులు. అయితే కరోనా  వైరస్ వ్యాప్తి దృశ్య ఇప్పటికే శ్రీవారి దర్శనాలను రద్దుచేసి భక్తులను తిరుమలకు రానివ్వకుండా పలు చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. దీంతో ఎప్పుడూ ఫుల్ గా ఉండే శ్రీవారి హుండీ కాస్త ప్రస్తుతం భక్తుల  రాక లేకపోవడంతో వెలవెలబోతోంది. అంతేకాకుండా రిసెప్షన్ దర్శక టిక్కెట్ల ద్వారా వచ్చే ప్రధాన ఆదాయాలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి తగ్గిపోయాయి. ఇదే సమయంలో ఉద్యోగులకు జీతాలు చెల్లింపులు ఇతర ఖర్చులు కూడా టీటీడీ నిర్వాహకులను సతమతం చేస్తున్నాయి. 

 

 

 ఈ క్రమంలోనే తాజాగా టీటీడీ ఫైనాన్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అయితే టిటిడి చరిత్రలోనే మొదటిసారిగా ఈ ఫైనాన్స్ కమిటీ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ధర్మకర్తల మండలి సబ్ కమిటీ లో ఒకటైన ఫైనాన్స్ కమిటీ సమావేశాన్ని లాక్ డౌన్  అమలులో ఉన్న కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించినట్లు తెలిపారు అధికారులు. ఇక ఈ ఫైనాన్స్ కమిటీ సమావేశంలో పలువురు టీడీపీ సభ్యులు పాల్గొన్నారు. అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫైనాన్స్ కమిటీ సమావేశం విజయవంతం కావడంతో ధర్మకర్తల మండలి సమావేశాన్ని కూడా ఇదే రీతిలో నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారట టీటీడీ అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: