కరోనాకు పుట్టినిల్లయిన చైనాకు ప్రపంచవ్యాప్తంగా చెడ్డపేరు వచ్చేసింది. ప్రస్తుతం చైనా లో తమ కంపెనీలు పెట్టుకున్న బహుళ జాతీయ సంస్థలు.. ఇప్పుడు పునరాలోచనలో పడ్డాయి. ఈ చైనాలో ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే అన్న ఆలోచనలో పడ్డాయి. చైనా విశ్వసనీయత కరోనా తర్వాత దారుణంగా పడిపోయింది. అయితే ఈ పరిస్థితిని మనకు అనుకూలంగా మలచుకోవాలని చేసుకోవాలని ఇండియా ప్రయత్నిస్తోంది.

 

 

చైనా నుంచి బయటకు రావాలనుకుంటున్న కంపెనీలను ఆకర్షించేందుకు మోడీ సర్కారు ప్రయత్నాలు ప్రారంభించింది. కరోనా వ్యాప్తి.. కరోనా విషయంలో అబద్దాలు చెప్పడం వంటి విషయాలపై అమెరికా, చైనాల మధ్య పరోక్ష యుద్ధమే నడుస్తోంది. మిగిలిన దేశాలు కూడా చైనా వ్యవహరించిన తీరుపై గుర్రుగా ఉన్నాయి. దీని ప్రభావం పారిశ్రామిక రంగంపైనా పడే అవకాశం పుష్కలంగా ఉంది.

 

 

ఇలాంటి నేపథ్యంలో పలు దేశాలకు చెందిన కంపెనీల యూనిట్లు చైనా నుంచి తరలిపోయే ఆలోనచనలో ఉన్నాయి. వాటిని భారత ప్రభుత్వం ఆకర్షించే పనిలో పడింది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయమై దృష్టి సారించారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వెయ్యి అమెరికా కంపెనీలను గత నెలలో భారత్ సంప్రదించిందట. చైనా కంటే ఎక్కువగా ప్రోత్సాహకాలు, మినహాయింపులు కల్పిస్తామని హామీ ఇచ్చిందట.

 

 

పరిశ్రమలు రావాలంటే.. వాటికి అనుకూలమైన విధానాలు ఉండాలి. పన్నులు తగ్గించాలి. కార్మిక చట్టాలను కాస్త మార్చాలి.. భూసేకరణ నిబంధనల్ని సరళతరం చేయాలి.. భారత్ ఇప్పుడు ఇవన్నీ చేస్తామని అమెరికా కంపెనీలను ఆహ్వానిస్తోందట. ప్రత్యేకిచి వైద్య పరికరాలు, ఫుడ్ ప్రాసెస్ యూనిట్లు, వాహనాల విడిభాగాల తయారీ కర్మాగారాలు భారత్ కు తరలి వచ్చే అవకాశం పుష్కలగా ఉందట.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: