విశాఖ గ్యాస్ దుర్ఘటన మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇది పరిహారాల విషయంలో దేశంలోనే కొత్త రికార్డుగా చెబు తున్నారు. ఈ మాటలు చెబుతున్నది వైసీపీ నాయకులు కాదు.. ఏకంగా బీజేపీ నాయకులే ఈ విషయాన్ని మెచ్చుకుంటున్నారు.

 

 

గ్యాస్ లీకేజీ ఘటనలో కోటి పరిహారం ప్రకటించడం దేశంలోనే మొదటిసారి అని బీజేపీ ఎమ్మెల్సీ పీవీ మాధవ్ చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని మెచ్చుకున్నారు. ఈ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్సీ పీవీ మాధవ్ అన్నారు. మనుషులకే కాదు.. మూగజీవాల విషయంలోనూ జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు.

 

 

విశాఖ గ్యాస్ దుర్ఘటనలో చనిపోయిన పశువులకు కూడా పాతికవేలు ఇస్తామని జగన్ చెప్పారని.. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ఆహ్వావిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్సీ పీవీ మాధవ్ అన్నారు. అయితే పరిహారం విషయం వరకూ బాగానే ఉన్నా.. దీనితో పాటు దీర్ఘకాలికంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ పీవీ మాధవ్ సూచించారు. ఏమాత్రం వీలున్నా కంపెనీని వేరే చోటకు తరలించాలని ఎమ్మెల్సీ పీవీ మాధవ్ సూచించారు.

 

 

జనావాసాలు లేని సమయంలో ఏర్పాటు చేసిన పరిశ్రమలను.. ఆ తరవాత మార్చాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తు చేస్తోందన్నారు. ప్రజల ప్రాణాలకన్నా ఏది ముఖ్యం కాదని మాధవ్ అన్నారు. గ్యాస్ దుర్ఘటన ప్యాకేజీ విషయంలో ఎప్పుడూ జగన్ నిర్ణయాలను తప్పుబట్టే నేతలు కూడా స్వాగతించారు. సిపిఐ, సీపీఎం, బీజేపీ, టీడీపీ నేతలు కూడా చాలా రోజుల తర్వాత ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని మెచ్చుకున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: