కరోనా.. ఇది ప్రపంచాన్ని మార్చేస్తోంది. ఈ మహమ్మారికి పుట్టినిల్లయిన చైనాకు దీని కారణంగా చెడ్డపేరు వచ్చేసింది. చైనా విశ్వసనీయత కరోనా తర్వాత దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం చైనా లో తమ కంపెనీలు పెట్టుకున్న బహుళ జాతీయ సంస్థలు.. ఇప్పుడు పునరాలోచనలో పడ్డాయి. ఈ చైనాలో ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే అన్న ఆలోచనలో పడ్డాయి. అయితే ఈ పరిస్థితిని మనకు అనుకూలంగా మలచుకోవాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది.

 

 

చైనా నుంచి బయటకు రావాలనుకుంటున్న కంపెనీలను ఆకర్షించేందుకు తెలంగాణ సర్కారు తమ ప్రయత్నాలు మొదలుపెట్టింది. తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించేందుకు మంత్రి కెటిఆర్ చైనా, అమెరికా మద్య ఏర్పడిన వివాదాన్ని వాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. చైనా నుంచి తరలిపోయే ఆలోచన ఉన్న కంపెనీలు తెలంగాణకు తరలి రావాలని... తమ రాష్ట్రం అందుకు అనుకూలమైనదని మంత్రి కేటీఆర్ స్వాగతిస్తున్నారు.

 

 

యూరోపియన్‌ బిజినెస్‌ గ్రూప్‌ ప్రతినిధులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశంలో వివిధ దేశాల రాయబారులు, వివిధ దేశాలోని ప్రముఖ కంపెనీల సీనియర్‌ ప్రతినిధులతో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆన్ లైన్ ద్వారా మాట్లాడారు. భారతదేశంలో తెలంగాణ లాంటి పలు రాష్ర్టాలు అత్యుత్తమ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ప్రమాణాల్లో అగ్రస్థానంలో ఉన్నాయని కేటీఆర్ గుర్తు చేశారు.

 

 

ఈవోబీ ర్యాంకులు రాష్ట్రాలకు ఇవ్వాల్సి వస్తే ప్రపంచంలోనే టాప్‌ 20 స్థానంలో తెలంగాణకు స్థానం దక్కుతుందని కేటీఆర్ అన్నారు. విదేశీ పెట్టుబడిదారులు రాష్ర్టాల కోణాల్లోంచి కూడా చూడాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా తెలంగాణలో సుమారు 13 వేల కంపెనీలకు అనుమతులు ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. తెలంగాణలో ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌, ఐటీ, డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ వంటి రంగాలకు సంబంధించి పెట్టుబడి అవకాశాలను కేటీఆర్ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: