మనిషికి వయస్సు పెరుగుతుందంటే అర్ధం అతనిలో మానసిక పరిణితి ఇంకా అభివృద్ధి చెందిందని అర్ధం.. ఇంతకు మానసిన పరిణితి అంటే చాలమంది ఎలా ఆలోచిస్తున్నారంటే చెడు భావనలో ఎక్కువగా మునిగిపోతున్నారు.. వయస్సు వచ్చిన సిగ్గుమాలిన పనులు చేయడానికి వెనకముందు ఆలోచించడం లేదు.. వయస్సు పెరిగే కొద్ది తమ ఆలోచనల విధానంలో మార్పులుండాలి, మానసికంగా దృఢంగా తయారవ్వాలి, భావోద్వేగాలను నియంత్రించు కోవడం, జీవితంలో ఒత్తిడిని జయించుకోవడం, కోరికలను అదుపులో పెట్టుకోవడం, సమాజంలో గౌరవాన్ని పొందడం, నీతికి న్యాయానికి కట్టుబడి ఉండటం ఇలాంటి మంచి లక్షణాలు వయస్సు రీత్యా మనిషికి అలవడాలి..

 

 

కానీ వయస్సు పెరుగుతున్న కొద్ది కొందరు కామాంధులుగా మారుతున్నారు.. ఇందుకు ఉదాహరణే ఈ ముసలి వాడు చేసిన దారుణం.. ఇంతకు ఏం జరిగిందంటే.. ఈ 75 ఏళ్ల వృద్ధుడు ఆరేళ్ల బాలికపై  అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.. ఆ వివరాలు తెలుసుకుంటే.. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలంలోని ఓ గ్రామంలో 75 ఏళ్ల వృద్ధుడు ఒంటరిగా పాకలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో సక్రమంగా ఉండవలసిన అతని బుద్ధి వికటించి ఒంట్లో రగులుతున్న కామ కోరికలను అదుపులో పెట్టుకోలేక బుధవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలిక అతని పాక సమీపంలో ఆడుకుంటుండగా,  ఆమెపై కన్నేసిన ఆ వృద్ధుడు బాలికను పాకలోకి లాక్కెళ్లి అత్యాచారానికి యత్నించాడు..

 

 

ఈ విషయాన్ని అక్కడే ఆడుకుంటున్న ఓ బాలుడు గమనించి వెంటనే బాలిక తల్లిదండ్రులకు చెప్పాడు.. దీంతో బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని వృద్ధుడి బారి నుంచి ఆ చిన్నారిని కాపాడి బయటకు తీసుకువచ్చి అతని మీద ఎల్‌.కోట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ ప్రయోగమూర్తి గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించి, నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇకపోతే కాటికి కాళ్లు చాపుకున్న వయస్సులో వృద్ధుడికి ఇదేం పాడు బుద్ధి అని గ్రామస్థులు ఆ ముసలివాడి మీద దుమ్మెత్తిపోస్తున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: