అర‌బ్ దేశాల్లో కోవిడ్‌-19త‌న విశ్వ‌రూపాన్ని చూపుతున్న నేప‌థ్యంలో వివిధ దేశాల నుంచి వ‌ల‌స వ‌చ్చిన కార్మికుల‌ను వెళ్లిపోవాల‌ని సూచించిన విష‌యం తెలిసిందే. ఈమేర‌కు ఆయా దేశాలకు స్వ‌యంగా ప్ర‌భుత్వ ప్ర‌తినిధుల‌కు ఫోన్ కాల్స్ ద్వారా స‌మాచారం అంద‌జేశారు. ఈనేప‌థ్యంలోనే భార‌త ప్ర‌భుత్వం స్పందించి అర‌బ్ దేశాల్లో ఉద్యోగ, ఉపాధిల్లో కొన‌సాగుతున్న వారిని స్వ‌దేశానికి చేర్చే ప‌నిని ఆరంభించింది. ఇందుకోసం వందేభార‌త్‌ మిష‌న్‌ను ప్రారంభించ‌డం గ‌మ‌నార్హం.  గురువారం అబుదాబి నుంచి గల్ఫ్ సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. తొలి విమానం అబుదాబి నుంచి బ‌య‌ల్దేరి కొచ్చికి  చేరుకుంది. 


గురువారం రాత్రి 10:20 గంటలకు కొచ్చి విమానాశ్రాయానికి చేరుకోవ‌డంతో చాలా మంది భార‌తీయులు ఉద్వేగానికి లోన‌య్యారు. అలాగే దుబాయ్ నుంచి రెండో విమానం కూడా కరుప్పూర్కు  చేరింది. ఈ రెండు విమానాల ద్వారా దాదాపు 363 మంది భార‌తీయులు దుబాయ్ నుంచి స్వ‌దేశానికి చేరుకున్నారు. అంత‌కుముందు దుబాయ్‌లోనే వీరికి వైద్య ఆరోగ్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. పూర్తి ఆరోగ్య‌వంతులుగా ఉన్న‌ట్లుగా ధ్రువీక‌రించుకున్నాకే విమాన ప్ర‌యాణానికి అనుమ‌తించారు.  ఈ రెండు విమానాలలో 49 మంది గర్భిణీ భారతీయ మహిళలు ఉండడం విశేషం. కోవిడ్‌-10దెబ్బ‌కు అర‌బ్ దేశాల‌న్ని కూడా ఆర్థికంగా తీవ్ర న‌ష్టాల‌ను ఎదుర్కొంటున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య రోజూ వేల‌ల్లో పెరుగుతూ పోతున్నాయి.


ఇదిలా ఉండ‌గా దుబాయ్‌లో ఉన్న భారతీయులను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేసింది. ఇక అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం డేటా సేకరణ వివరాలను దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ వెబ్‌సైట్ ద్వారా ప్రకటించింది. పోర్టల్ లో  తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఇండియ‌న్ ఎంబ‌సీ అధికారులు చెబుతున్నారు. కాగా, విమానంలో స్వదేశానికి వచ్చిన ప్రయాణికులకు రెండు మాస్కులు, శానిటైజర్, రెండు శాండ్‌విచ్‌లు, ఫ్రూట్ కేక్, నీళ్ల బాటిల్ అందజేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇండియాకు చేరుకున్న‌ ప్రయాణికులందర్నీ ఏడు రోజుల పాటు క్వారంటైన్లో కొన‌సాగేలా చ‌ర్య‌లు ఆరంభించారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: