క‌రోనా వైర‌స్‌పై అద్భుత పోరాట ప‌టిమ‌ను క‌న‌బ‌ర్చార‌ని చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్‌పై ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో జిన్‌పింగ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం విజ‌యంసాధించింద‌ని పేర్కొ న్నారు. అప‌త్కాలంలో ఉత్త‌ర‌కొరియాకు చైనా దేశం అంద‌జేస్తున్న స‌హాయాన్ని మ‌రువలేమ‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఇదిలా ఉండ‌గా గురువారం ఆయ‌న చైనా  అధ్య‌క్షుడు జిన్‌పింగ్‌కు వీడియో సందేశం పంపార‌ని ఉత్త‌ర‌కొరియా దేశ అధికారిక మీడియా సంస్థ వెల్ల‌డించింది.  జిన్ పింగ్ ఆరోగ్యంగా ఉండాలని, సమర్థుడైన జిన్‌పింగ్‌ నాయకత్వంలోని చైనీస్‌ పార్టీ, ప్రజలు వైరస్‌పై పైచేయి సాధించారని కొనియాడారు’’ అని తన కథనంలో పేర్కొంది. 


ఇప్ప‌టి వ‌ర‌కు చైనా అధ్య‌క్షుడితో త‌ప్పా ఇత‌ర దేశ అధ్య‌క్షుల‌తో గాని, ప్ర‌తినిధుల‌తో గాని నేరుగా మాట్లాడింది లేదు. ఒక్క జిన్‌పింగ్‌కు మాత్ర‌మే  వీడియో సందేశం పంపండం గ‌మ‌నార్హం. గ‌తంలో జ‌న‌వ‌రి మాసంలో కూడా ఓ వీడియో సందేశం ఆయ‌న‌కు పంపారు. కిమ్‌జాంగ్‌ ఉన్‌ ఆరోగ్యానికి సంబంధించి ఈ మధ్య మీడియాలో ర‌క‌ర‌కాలుగా  కథనాలు వ‌స్తుండ‌టంతో కొద్దిరోజుల క్రితం ఆయ‌న మీడియా ముందుకు వ‌చ్చారు. కిమ్‌ ఆరోగ్యం క్షీణించిందని, ఆయన గుండెనొప్పితో బాధపడుతు న్నాడని, శస్త్రచికిత్స జరిగిందని,  చివరి క్షణాల్లో ఉన్నారని, మరోసారి ఏకంగా ఆయన మరణించాడని ఇలా అనేక వార్తలు మీడియాలో ప్ర‌చురితం మ‌వ‌డం, ప్ర‌సారం కావ‌డం జ‌రిగింది.

అయితే ఆయ‌న  మే 2 వ తేదీన ఒక ఎరువుల కంపెనీని ప్రారంభించేందుకు బ‌య‌ట ప్ర‌పంచానికి క‌నిపించిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు ఓ కొత్త అనుమానంతో కూడిన ప్ర‌చారం మొద‌లైంది. అదేమంటే మీడియాకు క‌నిపించింది కిమ్ కాద‌ని ఆయ‌న డూప్ అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల తన సోదరి కిమ్‌ యో‌ జాంగ్‌‌తో కలిసి ఎరువుల ఫ్యాక్టరీకి వచ్చి రిబ్బన్‌ కట్ చేసిన స‌మ‌యంలో తీసిన ఫోటోల‌ను తీక్ష‌ణంగా గ‌మ‌నించిన వారికి ఈ విష‌యం అర్థం అవుతుంద‌ని నెటిజ‌న్లు పేర్కొంటున్నారు. ఇందుకు కిమ్‌ పాత ఫొటోలు.. ప్రస్తుత ఫొటోలు సరిపోల్చుతూ ముఖంలోని మార్పులను సాక్ష్యంగా చూపుతున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: