ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు అందరూ కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. అంతే కాకుండా ఉద్యోగులు అంతా కూడా వర్క్ ఫ్రొం హోమ్ చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే... ఒక ఉద్యోగి ఇంటి దగ్గర నుండి విధులు నిర్వహిస్తూ... మధ్య మధ్యలో అశ్లీల వెబ్ సైట్స్ ను చూసేవాడు. అందులో ఒక యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం చివరకు నగ్నంగా వీడియో కాల్స్ చేసుకునే వరకు వెళ్ళింది. కానీ చివరకు ఎంత ఘోరంగా మోసపోయాడో అర్థమయ్యింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 


ఇక పూర్తి వివరాల్లోకి వస్తే... హైదరాబాద్ నగరానికి చెందిన ఒక యువకుడు సాఫ్ట్ వేర్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆ యువకుడికి ఇంకా పెళ్లి అవలేదు. తన ఖాళీ సమయంలో ఆశ్లీల వీడియోలు చూసేవాడు. ఈ తరుణంలోనే ఒక వెబ్ సైట్స్ లో ఫోన్ నెంబర్ కనబడింది. ఇంక అందమైన అమ్మాయిలతో చాటింగ్ వీడియో కాలింగ్ ఫోటోల కోసం సంప్రదించాలని అందులో ఉండడంతో ఫోన్ చేయడం మొదలు పెట్టాడు. ఇక ఫోన్ చేయగా యువతి వల విసురుతో మాట్లాడుతూ... మెల్లగా ఆ మాటలకు యువకుడు ఫిదా అయ్యాడు.


అంతేకాకుండా తనకు ఫోటోలు కావాలి అని అనడంతో అందుకు డబ్బులు కూడా చెల్లించాడు ఆ యువతికి. ఇక ఉత్సాహం ఆపుకోలేక ఆ యువకుడు వీడియో కాలింగ్ మాట్లాడాలని కోరడంతో దానికి ఆ యువతి అంగీకారం చేరడంతో వీడియో కాల్ మొదలుపెట్టారు. అంతే కాకుండా అతడు ఒంటిపై దుస్తులు లేకుండా వీడియో కాల్స్ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక వీటిని గ్రహించిన సైబర్ ఆటగాళ్లు బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. 

 

అంతేకాకుండా అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆ వీడియో కాల్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించడం మొదలు పెట్టారు. ఇక ఆ యువకుడు భయపడి 20 వేల నుంచి 80 వేల వరకు డబ్బులు వాళ్ళకి ఇచ్చేశాడు. ఇక ఆ తర్వాత ఆ యువకుడు స్పందించకపోవడంతో అతని ఖాతాని జతచేస్తూ సోషల్ మీడియాలో ఫొటోస్ పెట్టారు. దీనితో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: