తెలంగాణ ఐటీ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కేంద్రం కీలక పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐటీ, పంచాయతీ శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కేటీఆర్ తన ప్రతిభను ప్రతి సందర్భంలోనూ నిరూపించుకుంటూ వస్తున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ఆయన చొరవ చూపిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రత్యేకంగా ఆ సమస్యల పరిష్కారానికి ఒక టీమ్ ను ఏర్పాటు చేసుకుని కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు. త్వరలో ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరంచనున్నారు అనే వార్తలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇదిలా ఉంటే.... ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. ముఖ్యంగా ఐటీ రంగం కోలుకోలేని విధంగా దెబ్బతింది. 

 

IHG

 

ఈ పరిస్థితిని చక్కదిద్దాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ఐటీ నిపుణులతో పాటు కేంద్ర మంత్రులతో కలిసి ఒక కమిటీని నియమించాలని  కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ కమిటీలో ప్రతిభ ఉన్న నాయకులను, నిపుణులను తీసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ పేరు చర్చకు   వస్తోంది. ఐటీ రంగంలో కేటీఆర్ చేసిన కృషికి విదేశీ పెట్టుబడులు ఎత్తున తెలంగాణకు వచ్చాయి. అంతేకాకుండా ఈ రంగంపై కేటీఆర్ కు పూర్తిస్థాయిలో అవగాహన ఉండటం, ఆయన సమర్థతపై కేంద్రానికి కూడా నమ్మకం కుదరకపోవడంతో ఇప్పుడు ఐటీ నిపుణులు, మంత్రులతో నియమించే కమిటీకి అధ్యక్షుడిగా కేటీఆర్ ను నియమించాలని కేంద్ర పెద్దల ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

 ఐటీ రంగాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలంటే, ప్రతిభ ఉన్న నాయకులు అవసరం ఉందని కేంద్రం గుర్తించింది. అందుకే కేటీఆర్ పేరును పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బిజెపి వర్సెస్ టిఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయ వైరం ఉన్నా, అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు కేటీఆర్ కు పదవి అప్పగించాలని కేంద్ర చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు దక్షిణాది రాష్ట్రాలపైన ప్రత్యేక దృష్టి పెట్టే విధంగా కేటీఆర్ కు కీలక బాధ్యతలు అప్పగించాలని కేంద్రం చూస్తోందట. కేటీఆర్ కూడా ఈ పదవి ని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: