ప్రస్తుత రోజులలో ప్రధాన నగరాలలో అతి పెద్ద సమస్య ట్రాఫిక్. ట్రాఫిక్ వల్ల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. సమస్యలను అరికట్టేందుకు నిత్యం ట్రాఫిక్ పోలీసులు కృషి చేస్తూనే ఉంటారు. ఇది ఇలా ఉండగా చెక్ పోస్టు వద్ద పాక్ చేసిన కార్లు తీయమన్నారు. ఇక అంతే పోలీస్ పై ఒక మహిళ విరుచుకుపడింది. దీనితో ఆ మహిళ పై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ లోని ఖైరతాబాద్ చౌరస్తాలో పోలీస్చెక్ పోస్ట్ ఉంది. ఇక చెక్ పోస్ట్ వద్ద రాత్రి సమయంలో వాహనాలను తనిఖీ నిర్వహించేందుకు ఏసిపి గోవర్ధన్ ఇన్స్ పెక్టర్ ఎం. రవి సిబ్బందితో కలిసి విధులు నిర్వహించడం మొదలు పెట్టారు.


దానితో చెక్ పోస్ట్ వద్ద 900 వాహనాలు తనిఖీలు నిర్వహించగా అందులో 150 వాహనాలు అనుమతి లేకుండా నడుపుతున్నారని గ్రహించి సీజ్ చేశారు పోలీసు అధికారులు. నిజానికి ఆ సమయంలో ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ నిలిచి పోవడం జరిగింది. ఇదే తరుణంలోని ఒక ప్రైవేటు బ్యాంకు ఉద్యోగిని తన ఫ్రెండ్స్ తో కలిసి అక్కడకు రావడం జరిగింది. అంతేకాకుండా రోడ్డుపైనే కారు ఆపి కుక్కలకు ఆహారం అందిస్తుంది. 


ఇక రోడ్డుపై వాహనం ఉండడంతో ట్రాఫిక్ పోలీస్ అధికారులు రోడ్డుపై ఉన్న కారుని పక్కకు తీయాలని తెలియజేశారు. ఇలా మంచిగా చెప్పినా... కూడా ఆమె రెచ్చిపోయి పోలీస్ అధికారులపై దురుసుగా ప్రవర్తించింది. అంతేకాకుండా దానికి అనుమతి ఉందా అని పోలీసులు అడగడంతో ఆ మహిళ అసభ్య పదజాలంతో పోలీసులపై విరుచుకుపడింది. అడగడానికి మీరు ఎవరు...? మీ సంగతి తేలుస్తాను అంటూ పోలీసులను దుష్ప్రచారాలు చేసింది. ట్రాఫిక్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ప్రజలకు ఇబ్బంది పెట్టిన ఈ మహిళపై పోలీస్ అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: