తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ రోజురోజుకి చాపకింద నీరులా విజృంభిస్తుంది. దీనితో ప్రజలు భయాందోళనలతో జీవనం కొనసాగిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 7320 శాంపుల్స్ పరీక్షలు నిర్వహించగా 54 మందికి ఈ వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడం జరిగింది. దీనితో ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 1887 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఇప్పటి వరకు 41 మంది మరణించడం జరిగింది. అలాగే 842 మంది ఈ మహమ్మారిని చేయించి డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ చికిత్స అందుకుంటున్న వారి సంఖ్య 1004.

తాజాగా విడుదలైన బులిటెన్ ఈ వివరాలలో అత్యధికంగా 16 కేసులు అనంతపురం జిల్లాలో నమోదు అయ్యాయి. అలాగే రెండవ స్థానంలో వైజాగ్ 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇక కర్నూలు జిల్లాలో 7 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇంకా వైజాగ్ లో ఇప్పటికే ఎల్ జి పాలిమర్స్ నుంచి విషవాయువు రిలీస్ అవ్వడంతో 12 మంది మరణించారు. అలాగే చాలామంది చికిత్స పొందుతున్నారు. వైజాగ్ లో ఈ ఘటన రాష్ట్ర ప్రజలందరినీ కలిచి వేసింది. ఒకవైపు కరోనా మరోవైపు ఈ గ్యాస్ లీకేజ్ .. వైజాగ్ ప్రజలు చాలా సమస్యలతో బాధపడుతున్నారు.  

 

ఇక నేటి బులిటెన్ తర్వాత ఏ జిల్లలో ఎన్ని కేసులు ఉన్నాయో ఇప్పుడు ఒక సారి చుద్దాం.


అనంతపూర్ 99,  
చిత్తూర్ 85 
ఈస్ట్ గోదావరి 46 
గుంటూరు 374 
కడప 96 
కృష్ణ 322 
కర్నూల్ 547 
నెల్లూరు 96
ప్రకాశం 61, 
శ్రీకాకుళం 5,  
విశాఖపట్నం 57, 
విజయనగరం 4,
వెస్ట్ గోదావరి 68,
ఇక ఇతర రాష్ట్ర వారు - 27 మందిగా ఉన్నారు. గత 3 రోజుల నుండి కూడా ఆంధ్రప్రదేశ్ లో కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది అని చెప్పవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: