ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరున్న కంపెనీ ఎల్జీ. దక్షిణ కొరియాకి చెందిన ఈ కంపెనీ మల్టీ నేషనల్ కంపెనీ గా అందరూ చెప్పుకుంటారు. అటువంటి కంపెనీలో విశాఖపట్టణంలో ప్రమాదం చోటుచేసుకోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుండి విషవాయువులు ఒక్కసారిగా హఠాత్తుగా ఉదయం రిలీజ్ కావటంతో ఆ కంపెనీ చుట్టుప్రక్కల ఐదు కిలోమీటర్ల మేరకు ఉన్న గ్రామ ప్రజలు ఆరోగ్యాలు మొత్తం ప్రమాదంలో పడ్డాయి. వెంటనే గ్రామాల్లో ఉన్న ప్రజలు, పోలీసులు అలర్ట్ కావటంతో చాలా వరకు ప్రాణ నష్టం తగ్గింది. అయితే ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకూడదని మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం సీఎం జగన్ ప్రకటించడం జరిగింది.

 

అయితే ఈ విషయంలో జగన్ మాట్లాడుతూ ప్రభుత్వం కచ్చితంగా ఇస్తుందని అది కంపెనీ నుండైనా లేకపోతే ప్రభుత్వం తరఫున అయినా డబ్బులు ఇవ్వటం గ్యారెంటీ అని చెప్పుకు రావడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఒకపక్క ఆర్థికంగా నష్టం ఉన్న రాష్ట్రంలో డబ్బులు ఎలా అయినా lg పాలిమర్స్ ముక్కు పిండి వసూలు చేసే స్కెచ్ జగన్ సర్కార్ వేసినట్లు సమాచారం. lg పాలిమర్స్ మంచి లాభాల్లో ఉన్న కంపెనీ కావటంతో వార్షిక ఆదాయం కొన్ని వందల బిలియన్ డాలర్ల రావటంతో...కంపెనీ నుండి వసూలు చేయాలని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం.

 

ప్రస్తుతం జగన్ సర్కార్ తో కంపెనీ ప్రతినిధులు కంప్రమైజ్ కోసం చర్చలు జరుపుతున్నారట. కానీ జగన్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదట డబ్బులు మొత్తం కంపెనీల నుండి వసూలు చేయాలని ఫుల్ గా డిసైడ్ అయ్యారట. రాష్ట్రంలో మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా ఈ విషయంలో కంపెనీ వెనకడుగు వేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా జగన్ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: